భారత్ లో ఎంతో ఆదరణ పొందిన టిక్ టాక్ తో పాటు అనేక చైనా మొబైల్ యాప్ లను కేంద్రం నిషేదించిన సంగతి తెలిసిందే. ఇండో చైనా ఘర్షణల నేపథ్యంలో చైనా తో అన్ని వ్యవహారాలూ తెగతెంపులు చేసుకోవాలనే ఆలోచనతో భారత్ ఉంది. దీనిలో భాగంగానే చైనా కు సంబందించిన మొత్తం 59 మొబైల్ యాప్ లను కేంద్రం తొలిగించిన సంగతి తెలిసిందే. ఈ యాప్ లను తొలగించడంతో టిక్ టాక్ తో సహా నిషేధానికి గురైన అన్ని యాప్ ల యాజమాన్యాలు ఆందోళనకు గురయ్యాయి.

IHG

అయితే ఆ యాప్ లకు కేంద్రం కాస్త వెసులుబాటు కల్పించింది. ఈ మేరకు సుప్రీం కోర్టు తమ వాదనను వినిపించడానికి అవకాశం ఇవ్వడంతో, టాప్ యాజమాన్యం ప్రముఖ న్యాయవాది మాజీ అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ ని సంప్రదించగా, భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా చైనాకు అనుకూలంగా తాను న్యాయస్థానంలో వాదించను అని, ఆయన టిక్ టాక్ కు క్లారిటీ గా చెప్పడంతో తమ వాదనలు వినిపించేందుకు మరో న్యాయవాదిని వెతికే పనిలో టిక్ టాక్ పడింది.

 

 

ఈ వ్యవహారాలతో టిక్ టాక్ ఉద్యోగులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో టిక్ టాక్ మాతృసంస్థ బైట్ డాన్స్ సీఈవో కెవిన్ మేయర్ ఇండియా లోని ఉద్యోగులను ఉద్దేశించి ఒక లేఖ రాశారు. ప్రజాస్వామ్యాన్ని పెంపొందించే దిశగా, తన నిబద్ధతతో ఉందంటూ ఆయన పేర్కొన్నారు. దేశంలో ఉన్న 20 కోట్ల మందికి పైగా, ప్రజలు తమ కళను టిక్ టాక్ ద్వారా బయటి ప్రపంచానికి తెలియపరిచే అవకాశం కల్పించిందని, ఈ కష్ట సమయంలో ఉద్యోగులు ఆందోళనకు గురికావద్దని, చట్టపరంగా నే ఈ సమస్యను పరిష్కరించుకునేందుకు ప్రయత్నిస్తున్నాము అంటూ ఆయన పేర్కొన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: