దేశంలో కరోనా బాధితుల సంఖ్యా రోజు రోజుకు పెరుగుతేనే ఉంది. కరోనా బారి నుండి కాపాడానికి దేశంలో లాక్ డౌన్ విధించారు. లాక్ డౌన్ తో కొంత మేరకు అయినా ఈ మహమ్మారిని అరికట్టవచ్చును అని అనుకున్నారు. కానీ లాక్ డౌన్ కారణంగా దేశంలో ఆర్థికంగా చాల నష్టం వాటిల్లింది. చాల మంది ప్రజలు కరోనా కారణంగా జీవనోపాధిని కోల్పోయారు. అంతే కాకుండా చాల మంది తినడానికి తిండి లేక చాల ఇబ్బందులను ఎదుర్కొన్నారు. అయితే వారికీ అండగా నిలిచేందుకు ప్రభుత్వం కొత్త పథకాలను అందుబాటులోకి తీసుకొచ్చింది.

 

 

అయితే 2020 ఏడాదిలో జూలై 1ని చాలా కీలకమైన రోజుగా చెప్పుకోవచ్చునన్నారు. ఎందుకంటారేమో.. ఈరోజు నుంచే చాలా అంశాలు మారాయన్నారు. ఆదాయపు పన్ను, ఆధార్‌కు సంబంధించిన రూల్స్‌‌లో కూడా మార్పు వచ్చింది. ఇకపై ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్ దాఖలు చేయాలంటే కచ్చితంగా ఆధార్ నెంబర్ ఇవ్వాల్సిందేనన్నారు.

 

 

అయితే మీరు ఆధార్ నెంబర్ కలిగి లేకపోతే ఇకపై ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్ దాఖలు చేయడం కుదరదని తెలిపారు. దీంతో జూలై నుంచి ఆధార్ ప్రాధాన్యం మరింత పెరిగిందని చెప్పుకోవచ్చునన్నారు. అంతేకాకుండా ఆధార్ కార్డు లేకపోతే పాన్ కార్డు కూడా తీసుకోవడం కుదరకపోవచ్చునన్నారు.

 

 

విదేశీ వ్యవహారాల శాఖ కూడా కీలక నిర్ణయం తీసుకుందన్నారు. పాప్‌పోర్ట్ తీసుకోవడానికి ఆధార్ నెంబర్ కచ్చితంగా ఉండాలని తెలియజేశారు. అంటే జూలై 1 తర్వాత మీరు పాస్‌పోర్ట్ తీసుకోవాలని యోచిస్తే.. తప్పనిసరిగా ఆధార్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుందన్నారు.

 

 

మరోవైపు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ కూడా పీఎఫ్ అకౌంట్‌తో ఆధార్ కచ్చితంగా లింక్ చేసుకోవాలని ఎప్పటి నుంచో చెబుతూ వస్తోంది. అలాగే పెన్షన్ తీసుకుంటున్న వారు కూడా ఆధార్ నెంబర్ వివరాలు తెలియజేయాల్సి ఉంటుంది. ఆధార్ లింక్ చేసుకోవడం వల్ల పీఎఫ్ అకౌంట్ నుంచి డబ్బులు సులభంగానే విత్‌డ్రా చేసుకోవచ్చునని తెలియజేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: