దేశంలో మార్చి నెలలో కరోనా వైరస్ ప్రబలి పోతుందని లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి రవాణా వ్యవస్థ పూర్తిగా స్థంభించిపోయింది. దాంతో రోడ్డు ప్రమాదాల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. కానీ ఈ మద్య కరోనా కేసులు పెరిగిపోతున్నా.. లాక్ డౌన్ విషయంలో మాత్రం సడలింపులు చేశారు. అంతే మళ్లీ రోడ్లపైకి వాహనాలు రావడం.. విచ్చలవిడిగా రోడ్డు ప్రమాదాలు జరగడం చూస్తున్నాం. తాజాగా ఖమ్మం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టిన ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.

 

ఏన్కూర్ మండల కేంద్రంలో చోటు చేసుకున్న ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే.. పాల్వంచ నుంచి ముగ్గురు వ్యక్తులు TS 28E 9333 నంబర్ కారులో హైదరాబాద్ బయల్దేరారు.  అప్పటికే వేగంగా వస్తున్న కారు.. అక్కడ ఆపి ఉన్న లారీని ఢీకొట్టింది. పాల్వంచ నుంచి ముగ్గురు వ్యక్తులు TS 28E 9333 నంబర్ కారులో హైదరాబాద్ బయల్దేరారు. ఏన్కూర్‌లో రోడ్డు పక్కన నిలిపి ఉన్న లారీని వీరు ప్రయాణిస్తోన్న కారు వెనుక నుంచి వేగంగా ఢీకొట్టింది. కారు ముందు భాగం లారీ కిందకు దూసుకెళ్లడంతో కారు ముందు భాగం నుజ్జునుజ్జయ్యింది. 

 

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.. గాయపడిన వారిని వెంటనే ఖమ్మం ప్రభుత్వ హాస్పిటల్‌కు తరలించారు. కాగా, ఈ ప్రమాదంలో వినోద్ అనే వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. కార్లో ప్రయాణిస్తోన్న మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం హాస్పిటల్‌కు తరలించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: