దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ శరవేగంగా వ్యాప్తి చెందుతోంది. కరోనా బాధితుల సంఖ్య, మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. చైనాలోని వుహాన్ లో పుట్టిన ఈ వైరస్ ప్రపంచంలోని అన్ని రంగాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు కోటీ 6 లక్షల కేసులు నమోదు కాగా 5.15 లక్షల మరణాలు సంభవించాయి. 
 
అమెరికాలో మాత్రమే 27 లక్షల మంది వైరస్ భారీన పడి మృతి చెందారు. ఏ వైరస్ వ్యాప్తి చెందనంత వేగంగా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుండటం గమనార్హం. కరోనా వైరస్ గురించి ఇప్పటికీ స్పష్టత రాని ప్రశ్నలు ఎన్నో ఉన్నాయి. ఇతర వైరస్ ల కంటే ఈ వైరస్ తీవ్రత ఎందుకు ఎక్కువగా ఉంది....? కొందరే ఎక్కువ తీవ్ర అనారోగ్యం భారీన పడుతున్నారు....? లక్షణాలు బయటపడని వ్యక్తులు వైరస్ వ్యాప్తికి ఎలా కారణమవుతున్నారు....? అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. 
 
వీటితో పాటు యాంటీబాడీలు తయారైన వారిలో రోగనిరోధక శక్తి ఎంతవరకు ఉంటుంది...? అనే ప్రశ్న కూడా వినిపిస్తోంది. జ్వరం, దగ్గు, శ్వాస అందకపోవడం కరోనా ప్రధాన లక్షణాలు. అయితే శాస్త్రవేత్తలు చేస్తున్న పరిశోధనల్లో కొత్త లక్షణాలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరికీ సోకుతున్న ఈ వైరస్ వల్ల ప్రధానంగా దీర్ఘకాలిక వ్యాధులతో బాధ పడేవారికి ముప్పు ఎక్కువగా ఉంది. 
 
వస్త్రంతో తయారు చేసిన మాస్కులు సైతం వైరస్ ను బాగానే అడ్డుకుంటున్నాయని తెలుస్తోంది. వైద్యులు ప్రధానంగా కరోనా మహమ్మారి నుంచి విముక్తి లభించాలంటే హెర్డ్ ఇమ్యూనిటీ ఉండాలని చెబుతున్నారు. వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే వైరస్ ను నియంత్రించటం సాధ్యమవుతుందని అంటున్నారు. ఈ ఏడాది చివరినాటికి కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.     

మరింత సమాచారం తెలుసుకోండి: