తమిళనాడులో తూత్తుకుడి జిల్లాలోని సతన్ కుళం పోలీస్ స్టేషన్ లో జరిగిన తండ్రి కొడుకుల కస్టడీ మారణాల కేసులో ఇన్స్పెక్టర్ శ్రీధర్ ను అరెస్ట్ చేసింది సీబీసీఐడీ. ఈకేసులో నిన్న ఎస్ ఐ రఘు గణేష్ అరెస్ట్ కాగా  ఈరోజు ఉదయం మరో ఎస్ ఐ బాలకృష్ణన్ , కానిస్టేబుల్ లు ముత్తురాజ్, మురుగన్ లు కూడా అరెస్టు అయ్యారు. వీరందరిని సెక్షన్ 302 హత్యానేరం కింద అదుపులోకి తీసుకున్నారు. ఇక తాజాగా శ్రీధర్ అరెస్ట్ తో తమిళనాడు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఈకేసులో శ్రీధర్ ఏ1 నిందితుడిగా వున్నాడు. మరోవైపు ఈకేసులో హెడ్ కానిస్టేబుల్ రేవతి తోపాటు,స్పెషల్ ఎస్ ఐ పాల్ దొరై ,ముత్తురాజు కూడా అప్రువర్లుగా మారడానికి ఒప్పుకున్నారని తెలుస్తుంది. మదురై కోర్టు కూడా ఈ కేసు విషయంలో బాధిత కుటుంబానికి న్యాయం చేసేలా అడుగులు వేయడం శుభపరిణామం. ఎక్కువ రోజులు సాగదీయకుండా త్వరలోనే  ఈకేసులో తుది తీర్పును ఇవ్వనుంది. 
 
ఇక లాక్ డౌన్ నిబంధనలకు విరుద్ధంగా షాప్ తెరిచివుంచారని జూన్ 19న తండ్రి కొడుకులను ( జయరాజ్, బెనిక్స్) సతన్ కుళం పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించి చిత్ర హింసలకు గురి చేయడంతో జూన్ 22 న బెనిక్స్ ,23న జయరాజ్ మృతి చెందారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: