ఈ భూమిపై ఎన్నో వింతలూ విడ్డూరాలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు టెక్నాలజీ బాగా పరిగిపోయింది.. ముఖ్యంగా సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి ప్రపంచంలో జరిగే వింతలూ విడ్డూరాలకు సంబంధించిన పోస్ట్ లు చేస్తున్నారు. ఒకప్పుడు బ్రంహ్మాంగారు అన్నట్లు ఒక జంతువు కడుపులో మరో జంతువు ఆకారం జన్మిస్తుందని.. ప్రళయం వస్తుందని.. ప్రకృతిలో పక్షు పక్షాదులకు చిత్రమైన ఆకారాలతో పుడతాయని అన్నారు.  ప్రకృతికి భిన్నంగా ఏదో ఒక చోట ఆసక్తికర ఘటనలు వెలుగు చూస్తూనే ఉన్నాయి.  మరోవైపు ఇలాంటి పుట్టుకలకు కారణం జన్యుపరమైన లోపాలని అంటున్నారు వైద్య నిపుణులు.  ఏది ఏమైనా మనం చూడలేని ఎన్నో విడ్డూరాలు కళ్లకు చూపించడం మంచి విషయమే.  

 

తాజాగా పెద్దపల్లి జిల్లాలోనూ ఇలాంటి సంఘటనే వెలుగు చూసింది. బొప్పాయి పండులో గింజలు మొలకెత్తడం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. సాధారణంగా ఏదైనా పండు కోస్తే అందులో గింజలు ఉండటం చూస్తుంటాం.  కొన్ని గింజలు బట్టలో కట్టి ఉంచినా అవి మొలకెత్తడం చూస్తుంటాం.  కొన్ని గింజలను భూమిలో పాతిపెడితే అవి మొలకలుగా రావడం చూస్తుంటాం. కానీ చెట్టు మీద ఉన్న బొప్పాయిలో మొలకలు ఎత్తడం అందరినీ ఆశ్చర్యపరిచింది స్వప్నకాలనీలో ఉండే సత్యనారాయణ అనే వ్యక్తి తన పెరిటిలోని బొబ్బాయి చెట్టుకు ఉన్న పండును తీసుకొచ్చాడు. పిల్లలు తినేందుకు దాన్ని కోసి చూడగానే విస్తుపోయాడు.

 

ఆ పండులోపల గింజలు మొలకెత్తి మెల్లగా మొక్కగా మారుతుండటంతో ఆశ్చర్యపోయాడు. అది కాస్తు చుట్టుపక్కల వాళ్లకు తెలియడంతో ఈ వింత చూడటానికి ఎగబడుతున్నారు.  ఇది నిజంగా బ్రంహ్మం గారు చెప్పి వింతల్లో ఒకటా అని అనుకుంటున్నారు చూసిన వారు. ఇంతకీ ఇది ఎలా జరిగిందని ఎవరికి అంతు పట్టడం లేదు.  ఏది ఏమైనా ఇది కూడా ఏదైనా జన్యుపరమైన కారణం ఉండొచ్చని మరికొంత మంది అభిప్రాయ పడుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: