ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఇప్పుడు అంద‌రి చూపు క‌రోనా వ్యాక్సిన్‌పైనే. ప్రపంచ దేశాలకు చెందిన ఆయా కంపెనీలు కరోనా వ్యాక్సిన్ ను తయారు చేస్తుండగా.. ఈ వ్యాక్సిన్ ఎప్పుడు అందుబాటులోకి రానుంద‌నే ఆస‌క్తి స‌ర్వ‌త్రా వ్య‌క్త‌మవుతోంది. ఈ నేప‌థ్యంలో ఆక్స్‌వర్డ్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్ సునేత్ర గుప్తా ప‌లు కీల‌క విష‌యాలు పంచుకున్నారు. తక్కువ మరణాలు నమోదవుతున్న దృష్ట్యా కరోనా వైరస్‌కు వ్యాక్సిన్‌ను డెవలప్ చేయడం సులువేన‌ని విశ్లేషించారు. కరోనా వ్యాప్తిని అడ్డుకోవడానికి లాక్‌డౌన్ శాశ్వ‌త ప‌రిష్కారం కాద‌ని ఆమె తేల్చిచెప్పారు.

 


క‌రోనా వ్యాక్సిన్‌, లాక్ డౌన్ గురించి ఓ ఇంటర్వ్యూలో ఆక్స్‌వర్డ్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్ సునేత్ర గుప్తా కీల‌క విష‌యాలు పేర్కొన్నారు. వైరస్‌ను నిలువరించడానికి లాక్‌డౌన్ మంచి నిర్ణయమే అయినప్పటికీ ఎక్కువ రోజులు కరోనాను నియంత్రించడానికి ఇది సరిపోదని అన్నారు. లాక్‌డౌన్‌ను కొన్ని దేశాలు సమర్థంగా నిర్వహించాయని పేర్కొన్న సునేత్ర ఆయా దేశాలు వైరస్‌ను మళ్లీ ఎదుర్కోవాల్సి వస్తోందని వివ‌రించారు. దీన్నిబ‌ట్టి క‌రోనా వ్యాప్తికి లాక్‌డౌన్ దీర్ఘ కాల పరిష్కారం కాదని ఆక్స్‌వర్డ్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్ తేల్చిచెప్పారు. దీంతో పాటుగా మనలో చాలా మందికి కరోనా వ్యాక్సిన్ అవసరం లేదని,  ‘వయస్సు పైబడిన వృద్ధులు, బలహీనంగా ఉన్న వారివ‌లే ఆరోగ్యవంతులు కూడా భయపడుతున్నారు. ఈ వైరస్ గురించి అంతగా ఆందోళన చెందాల్సింది ఏమీ లేదు. ఇది కూడా ఫ్లూ లాంటిదే. మనలో చాలా మందికి కరోనా గురించి చింతించాల్సిన అవసరం లేదు.` అని ఆమె తేల్చిచెప్పారు. క‌రోనా వ్యాక్సిన్ రూపొందించ‌డంతో పాటుగా టీకా పని చేస్తుందని రాబోయే ఒక‌ట్రెండు నెల‌ల్లోనే రుజువు చేయాల్సి ఉంద‌ని విశ్లేషించారు.

 

ఇదిలాఉండ‌గా, కరోనా వైరస్ వ్యాక్సిన్ సెప్టెంబర్ నాటికి అందుబాటులోకి తెచ్చేందుకు పరిశోధనలు నిర్విరామంగా కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఈ పరిశోధనలు విజయవంతం అయితే వ్యాక్సిన్ ఖరీదు ఎంత అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రపంచ దేశాలకు చెందిన ఆయా కంపెనీలు కరోనా వ్యాక్సిన్ ను తయారు చేస్తుండగా.. మనదేశంలో ఆరు కంపెనీలు టీకాలను అభివృద్ధి చేసే పనిలో పడ్డాయి. వాటిలో ఒకటి సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా. అత్యధిక డోసుల టీకాల ఉత్పత్తి, అమ్మకాల ద్వారా ప్రపంచంలోనే అతి పెద్ద సంస్థగా ఇది గుర్తింపు పొందింది. వ్యాక్సిన్ అందుబాటులోకి తెచ్చేందుకు ఆక్సస్ ఫర్డ్ యూనివర్సిటీ మనుషుల పై జరిపిన ప్రయోగాల ఆధారంగా టీకా ను తయారు చేస్తున్నట్లు సీరమ్ ప్రకటించింది. మే నుంచి సొంతంగా పరిశోధనల చేయనున్నట్లు  తెలిపింది.

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: