భారత్ ఏ దేశంతోనైనా సత్సంబంధాలను కోరుకుంటుంది. ఇతర దేశాలకు సాయం చేయగలిగే పరిస్థితిలో ఉంటే భారత్ తప్పకుండా సహాయం చేస్తుంది. వివాదాలను సృష్టించాలని భారత్ ఎప్పుడూ భావించదు. ఇతర దేశాలు కయ్యానికి కాలు దువ్వితే మాత్రం ధీటుగా బదులిస్తుంది. అవసరమైతే ఆ దేశం విషయంలో కఠినంగా వ్యవహరించడంతో పాటు ఎగుమతులు, దిగుమతులను కూడా నిషేధిస్తుంది. 
 
 
అదే సమయంలో స్నేహంగా మెలిగే దేశాలకు అన్ని విధాలా తోడ్పాటు అందిస్తుంది. తాజాగా చైనా భారత్ వివాదం, కొన్నేళ్ల నుంచి పాక్ భారత్ మధ్య వివాదం ఉండటంతో భారత్ తో స్నేహం వదిలితే ఆ దేశాలకే నష్టమనే వాదన వినిపిస్తోంది. తాజాగా పాక్ ఎంపీ మాట్లాడుతూ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి లో 192 దేశాలకు గాను 184 దేశాలు భారత్ కు మద్దతు ఇచ్చాయి. గతంలో ఏ దేశానికి 160 దేశాలకు మించి ఐక్యరాజ్యసమితిలో మద్దతు రాలేదు. 
 
ప్రధానిగా మోదీ ఉన్న సమయంలో భారీ సంఖ్యలో దేశాలు భారత్ కు మద్దతు ఇచ్చాయంటే ఆ దేశం గొప్పతనం అర్థమవుతుంది. అయినా భారత్ విషయంలో పాక్ ఆషామాషీగా వ్యవహరిస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు. మరోవైపు భారత్ తో కవ్వింపు చర్యలకు చైనా పాల్పడటం గురించి ఆ దేశానికి హెచ్చరికలు జారీ అవుతున్నాయి. భారత్ తో తగువు చైనాకే నష్టమని ఆర్థిక నష్టంతో పాటు ప్రపంచ దేశాలతో కూడా శత్రుత్వం ఏర్పడుతుందని చైనాకు చెందిన పలు ఉగ్రవాద సంస్థల నుంచి హెచ్చరికలు జారీ అయ్యాయి. 
 
భారత్ భూభాగాలను చైనా ఆక్రమించాలని ప్రయత్నిస్తోంటే గతంలో ఎన్నడూ రానంతటి వ్యతిరేకత వస్తోందని.... భారత్ ఇతర దేశాల భూభాగాలను కబ్జా చేస్తుందని భావించరని.... ఇలాంటి సమయంలో చైనా చేస్తున్న చర్యలను ప్రపంచ దేశాలు గమనిస్తున్నాయని.... భవిష్యత్తులో భారత్ తో వివాదం వల్ల చైనా తీవ్రంగా నష్టపోనుందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. భూభాగ విస్తరణ కోసం భారత్ తో తగువు పెట్టుకోవద్దని చైనాకు  ఇతర దేశాలు సూచనలు చేస్తున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: