ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన రోజు నుంచి జగన్ సర్కార్ రైతుల సంక్షేమం కోసం పాటు పడుతున్న సంగతి తెలిసిందే. రైతుల కోసం ఏపీ ప్రభుత్వం ఎన్నో పథకాలను ప్రవేశపెడుతోంది. రైతులకు గిట్టుబాటు ధరలను కల్పించాలనే ఉద్దేశంతో కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. పంటలకు నష్ట పరిహారం కూడా చెల్లిస్తోంది. తాజాగా జగన్ సర్కార్ రాష్ట్రంలో పొగాకు పండిస్తున్న రైతులకు శుభవార్త చెప్పింది. 
 
రాష్ట్రంలో ప్రభుత్వమే పొగాకు కొనుగోళ్లు చేపట్టేందుకు సిద్ధమవుతోంది. మంత్రి కురసాల కన్నబాబు . సీఎం జగన్‌ ఆదేశాల మేరకు బుధవారం నుంచి రాష్ట్రంలో పొగాకు కొనుగోళ్లు చేపడుతున్నట్టు స్పష్టం చేశారు. మార్క్‌ఫెడ్‌‌ ద్వారా పొగాకు కొనుగోళ్లను ప్రభుత్వమే చేపడుతుందని ఆయన మీడియాకు తెలిపారు. ఒంగోలులోని 1, 2 కేంద్రాల ద్వారా పొగాకు కొనుగోళ్లు ప్రారంభిస్తామని.... తరువాత అన్ని ప్రాంతాల్లో కొనుగోళ్లు చేపడుతామని అన్నారు. 
 
తాము ఎఫ్‌3, ఎఫ్‌4, ఎఫ్‌5, ఎఫ్‌8, ఎఫ్‌9 గ్రేడు పొగాకును కొనుగోలు చేయనున్నామని చెప్పారు. పొగాకు బోర్డు చెప్పిన దానికంటే అధిక మొత్తానికి పొగాకును కొనుగోలు చేయనున్నట్లు ప్రకటన చేశారు. తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, ప్రకాశం, ఒంగోలు తదితర జిల్లాల్లో రైతులు ఎక్కువగా పొగాకును పండిస్తారు. దాదాపు మూడు దశాబ్దాల నుంచి రైతులు పొగాకు పంటను పండిస్తున్నారు. 
 
సాగు ప్రారంభంలో మంచి ధర ఇచ్చిన కంపెనీలు క్రమేపీ రేటును తగ్గించుకుంటూ రావడం.... ఖర్చులు పెరగడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం తామే స్వయంగా కొనుగోళ్లు చేసి రైతుల్ని ఆదుకోవాలని తన వంతు ప్రయత్నాన్ని ప్రారంభించింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.                                     

మరింత సమాచారం తెలుసుకోండి: