దేశంలో కరోనా అంటే భయపడిపోతున్నారు.  కరోనా సోకిందంటే ఐన వాళ్లను కూడా పక్కన బెడుతున్నారు.  కరోనా వచ్చిందని సొంత తల్లిని ఇంటి నుంచి బయటకు పంపిన తయులు ఉన్నారు. ఇక కరోనాతో మరణించిన వారి పరిస్థితి మరీ దారుణంగా ఉంది. కొన్ని చోట్ల అమానవీయంగా వాటిని దహనం చేస్తున్నారు.. పూడ్చుతున్నారు. ఆ మద్య కరోనాతో మరణించిన వ్యక్తిని జేసీబీ తో తీసి వేశారు.. అంతకు ముందు చెత్త బండిలో తరలించారు.  ఇలా ఎన్నో దారుణమైన ఘటనలు వెలుగు లోకి వస్తునన్నాయి. కరోనా మహమ్మారి ఎన్నో కుటుంబాలను అనాధలను చేస్తోంది. చివరకు మరణించిన వారికి అందరూ ఉండి కూడా అనాధ శవంలా.. అతి దారుణంగా పూడ్చబడుతున్నారు. తాజాగా కర్నాటకలో జరిగిన ఉదంతం ఇందుకు అద్దం పడుతోంది.

 

ఈ మద్యనే కరోనా కారణంగా చనిపోయిన 18 మంది సామూహిక అంత్యక్రియల్లో అధికారుల నిర్లక్ష్య వైఖరిపై కర్ణాటక సీఎం యడియూరప్ప మండిపడ్డారు. కరోనా మృతులను గోతుల్లోకి విసరిపారేస్తూ అంత్యక్రియలు నిర్వహించిన తీరుపై మీడియా, సోషల్‌ మీడియాల్లో విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో సీఎం తీవ్రంగా స్పందించారు. అంత్యక్రియలు నిర్వహించిన ఆరుగురు సిబ్బందిపై సస్పెన్షన్‌ వేటు వేస్తున్నట్టు ప్రకటించారు. ఇటీవల బళ్లారిలో కోవిడ్-19 బాధితుల శవాన్ని గుంతల్లోకి విసిరేసిన ఘటన మరవక ముందే.. క‌ర్ణాట‌క‌లో మరో దారుణం వెలుగులోకి వచ్చింది.

 

పీపీఈ సూట్లు ధ‌రించిన వైద్య సిబ్బంది ఒక శ‌వాన్ని క‌ర్ర సాయంతో ఈడ్చుకుంటూ తీసుకెళ్తున్నారు. అది కూడా గ‌ట్టు పొలాల మ‌ధ్య‌లో ఆగి ఆగి మ‌రీ లాక్కెళ్తున్నారు. ఈ సంఘ‌ట‌న యాద‌గిరి జిల్లాలో చోటు చేసుకున్న‌ది. అయితే గ్రామస్థులు ఆ శవాన్ని తమ పొలాల మధ్య పూడ్చకూడదని చెప్ప‌డంతో కుటుంబ స‌భ్యులు త‌మ పొలాల మ‌ద్య పూడ్చ‌మ‌ని చెప్పారు. క‌నీసం కుటుంబ స‌భ్యులు కూడా శ‌వాన్ని ప‌ట్టించుకోక‌పోతే ఎలా?' అంటూ నెటిజ‌న్లు కామెంట్లు పెడుతున్నారు. పోనీ అద‌న‌పు సిబ్బందిని వెంట తీసుకెళ్లినా వైద్యుల‌కు సులువుగా ఉండేది క‌దా అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: