చైనా భారత్ దేశాల మధ్య వివాదం అంతకంతకూ ముదురుతోంది. భారత్ చైనాకు వరుస షాకులిస్తూ ఆ దేశాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. చైనాను ఆర్థికంగా దెబ్బ తీసే దిశగా భారత్ వ్యవహరిస్తోంది. ఇప్పటికే భారత్ చైనా దేశానికి చెందిన టిక్ టాక్ సహా 59 యాప్ లపై నిషేధం విధించింది. ఈ నిషేధం వల్ల చైనాకు వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లుతోంది. మరోవైపు హైవేల ప్రాజెక్టుల్లో చైనా కంపెనీలపై నిషేధం విధిస్తూ మరొ షాక్ ఇచ్చింది. 
 
అయితే చైనా భారత్ ను దెబ్బ తీయాలనే ఉద్దేశంతో సైబర్ దాడులకు ప్రణాళిక రచిస్తోందని గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. హ్యాకర్లు ప్రతి దేశంలో ఉంటారు. మన దేశంలో కూడా టెక్నికల్ హ్యాకర్లు ఎక్కువగా ఉన్నారు. హ్యాకర్లు టెక్నాలజీ మిస్ యూజ్ చేస్తూ తప్పు పనులు చేసేవారిని పట్టుకుంటూ ఉంటారు. అదే సమయంలో కొంతమంది హ్యాకింగ్ ను చెడు మార్గంలో ఉపయోగిస్తూ నేరాలకు పాల్పడుతూ ఉన్నారు. 
 
మన హ్యాకర్లకు కూడా దేశభక్తి అనేది ఎంతో ఉంది. చైనా దేశం హ్యాకర్ల ద్వారా ప్రపంచ దేశాలకు సంబంధించిన సైనిక రహస్యాలను కొట్టేసేలా వ్యవహరిస్తోంది. వైద్య పరిశోధనలను కూడా హ్యాకర్ల ద్వారా కొట్టేసే వ్యవహారాలకు చైనా పాల్పడుతోంది. గాల్వన్ లోయలో ఈ నెల 15న భారత్ చైనా ఘర్షణల తర్వాత పీపుల్స్ లిబరేషన్ ఆర్మీకి మద్దతుదారులుగా ఉన్న హ్యాకర్లు రెచ్చిపోతున్నారని తెలుస్తోంది. 
 
సింగపూర్ కు చెందిన ప్రముఖ సంస్థ రెండు వారాల నుంచి భారత్ పై జరుగుతున్న దాడులు 300 శాతం పెరుగుతున్నాయని చెబుతోంది. తొలుత్ వెబ్ సైట్లపై దృష్టి పెట్టి కీలక సమాచారం సేకరిస్తున్నాయని చెబుతున్నారు. చైనా హ్యాకర్లు స్వయంగా రంగంలోకి దిగారని సింగపూర్ కు చెందిన ప్రముఖ కంపెనీ చెబుతూ ఉండటంతో భారత్ వీటి విషయంలో అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. దీంతో ఇకపై భారత్ హ్యాకర్లు కూడా చైనా దేశానికి షాక్ ఇచ్చే దిశగా అడుగులు వేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: