నేడు భారత స్టాక్ మార్కెట్లు దుమ్ము రేపాయి. బెంచ్ మార్కు సూచీలన్ని కూడా లాభాల వైపు దూసుకుపోయాయి. అమెరికా ఫార్మా దిగ్గజం ఫైజర్ ఇంకో కరోనా చికిత్సకు సంబంధించి అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్ పై ఆశలతో దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల బాట పట్టాయి. ఇక నేడు సెన్సెక్స్ 429 పాయింట్లు ఎగబాకి 35844 వద్ద ముగిసింది. అయితే ఇంట్రాడేలో సైన్సెస్ 928 పాయింట్ల ర్యాలీ చేయగలిగింది. అలాగే నిఫ్టీ కూడా 122 పాయింట్లు లాభంతో 10552 వద్ద ముగిసింది. నేడు ఉదయం 35604 వద్ద మొదలైన సెన్సెక్స్ నిదానంగా బలపడుతూ 36 వేల మార్కును చేరుకుంది.

 

 

ఇక నేడు మెటల్, ఫార్మా, ఫైనాన్స్, డిఐఐ ల పెట్టుబడులు ఊపందుకోవడంతో మార్కెట్ లాభాల వైపు నడిచింది. ఇక నేటి నిఫ్టీ 50 లో మహీంద్రా అండ్ మహీంద్రా, హీరో మోటార్ కార్, టైటాన్ కంపెనీ, టాటా స్టీల్, ఇన్ఫోసిస్ కంపెనీల షేర్లు లాభాల బాట పడ్డాయి.ఇక ఇందులో మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ షేర్స్ ఏకంగా ఆరు శాతం పైగా లాభాల బాట పట్టింది. ఇక మరోవైపు యాక్సిస్ బ్యాంక్, వేదాంత, యు పి ఎల్, హెచ్ యు ఎల్, జి ఎంటర్టైన్మెంట్ కంపెనీల షేర్లు నష్టాల బాట నడిచాయి. ఇందులో యాక్సిస్ బ్యాంక్ షేర్లు 2 శాతం పైగా నష్టాల బాట పట్టింది. 

 


మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లో భారత రూపాయి మారకపు విలువ డాలర్ తో పోలిస్తే 95 పైసలు బలపడి 74.85 వద్ద ట్రేడ్ కొనసాగుతోంది. అలాగే క్రూడ్ ఆయిల్ కూడా 0.05 శాతం నష్టపోయి 3001 కి చేరుకుంది. ఈరోజు బజాజ్ ఫైనాన్స్, రిలయన్స్, యాక్సిస్ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్ షేర్లు అత్యధిక యాక్టివ్ గా ఉన్న షేర్లు.

మరింత సమాచారం తెలుసుకోండి: