బంగారం ధరలు భగభగ మండిపోతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో 10 గ్రాముల పసిడి ధర 50 వేల రూపాయల మార్క్‌ను తాకింది. బులియన్‌ మార్కెట్‌ పరుగులు పెట్టడంతో.. బంగారం, వెండి ధరలూ రేసు గుర్రంలా పరుగుపెట్టాయి. 

 

ఢిల్లీలో మేలిమి బంగారం ధర 647 రూపాయలు పెరిగింది. దీంతో పది గ్రాముల ధర 49 వేల 908 రూపాయల దగ్గర ఆగింది. ఫ్యూచర్స్‌ మార్కెట్‌లో అయితే 10 గ్రాముల పుత్తడి ధర 48 వేల 871 రూపాయలకు చేరి రికార్డ్ సృష్టించింది. తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ ప్రభావం కనిపించింది. తెలుగు రాష్ట్రాల్లో 10 గ్రాముల మేలిమి బంగారం 50 వేల 480 నుంచి 50 వేల 950  రూపాయల మధ్య ట్రేడ్‌ అయింది. కిలో వెండి ధర  50 వేలు దాటింది.

 

హైదరాబాద్ లో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం 470 రూపాయలు పెరిగింది. దీంతో 46,740 రూపాయల వద్ద నిలిచింది. ఇక 24 క్యారెట్ల బంగారం కూడా పది గ్రాములకు 470 రూపాయల పెరుగుదల నమోదు చేసింది. దీంతో 50 వేల రూపాయల మార్కును దాటి 50,950 రూపాయల వద్ద నిలిచింది. బంగారం ధరలతో పాటు వెండి ధరలు కూడా భారీ పెరుగుదల నమోదు చేశాయి. కేజీ వెండి ధర బుధవారం నాటి ధరల కంటే ఏకంగా 1550 రూపాయల పెరుగుదల నమోదు చేసింది. దీంతో ఒక్కసారిగా 50 వేల రూపాయల రికార్డు మార్కు దాటి ఎగసింది. కేజీ వెండి ధర 50,050 రూపాయలకు చేరుకుంది. ఇక విజయవాడ, విశాఖపట్నంలలో కూడా బంగారం ధరలు ఇదే విధంగా ఉన్నాయి. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం 470 రూపాయలు పెరిగింది. దీంతో 46,740 రూపాయల వద్ద నిలిచింది. ఇక 24 క్యారెట్ల బంగారం కూడా పది గ్రాములకు 470 రూపాయల పెరుగుదల నమోదు చేసింది. దీంతో 50 వేల రూపాయల మార్కును దాటి 50,950 రూపాయల వద్ద నిలిచింది.

 

అంతర్జాతీయంగా బంగారం ధరల్లో చోటు చేసుకునే మార్పులు.. దేశీయంగా బంగారానికి డిమాండ్.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరలు మారుతుంటాయి. ప్రస్తుతం బులియన్ మార్కెట్ జోరు మీదుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: