దేశంలో కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు ఎక్కువగా జరుగుతున్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పేరు మారుమ్రోగుతోంది. దాదాపు ఆరు లక్షలకు పైగా కరోనా నిర్ధారణ పరీక్షలు ఏపీలో జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. ఇటువంటి తరుణంలో అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న కరోనా నిర్ధారణ పరీక్షల్లో విశ్వసనీయత ఉందా అనే ప్రశ్న ఇటీవల తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఓ నేత చేయించుకున్న పరీక్ష ద్వారా ఉత్పన్నమైంది. తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఎమ్మెల్సీ దీపకర్‌రెడ్డి ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలోనే వైద్యపరీక్షలు చేయించుకుంటే పాజిటివ్ అని రిపోర్టు వచ్చిందట, ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రంలో చేయించుకుంటే  నెగిటివ్ రిపోర్ట్ అని తేలిందట. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే చెప్పడంతో ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు రాష్ట్రంలో జరుగుతున్న కరోనా పరీక్షలలో అనుమానాలు వ్యక్తం చేశారు.

 

జరుగుతున్న పరీక్షలలో నిజాలు వెలుగులోకి తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదే తరుణంలోప్రముఖ రాజకీయ విశ్లేషకుడు ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో ప్రొఫెసర్ నాగేశ్వర్ ఏమన్నారంటే….‘దీన్ని చాలా సీరియస్‌గా పరిగణించాలి. కేంద్రం జోక్యం చేసుకోవాలి. కరోనా పరీక్షల్లో అనుమానాలు రావడమంటే చిన్న విషయం కాదు. ఆ టెస్టుల కోసం వినియోగిస్తున్న కిట్స్‌పైనే అనుమానాలు వ్యక్తం చేసినట్లవుతుంది. మరి, కేంద్రం, ఐసీఎంఆర్‌ ఆమోదం లేకుండానే వీటిని రాష్ట్రాలు కొనుగోలు చేసే అవకాశం వుందా.? రాష్ట్ర ప్రభుత్వం కూడా చంద్రబాబు ఆరోపణలపై స్పందించాలి.

 

తప్పుడు ఆరోపణలు చేస్తే చర్యలు తీసుకోవాలి..’ అని  చెప్పుకొచ్చారు. ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్ కొత్త పాజిటివ్ కేసులు ఎలా బయట పడుతున్నాయో అదే రీతిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా నిర్ధారణ పరీక్షలు జరుగుతున్న కొత్త పాజిటివ్ కేసులు బయటపడుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష నేత చంద్రబాబు మరియు తెలంగాణ ఎమ్మెల్సీ చేసిన ఆరోపణల్లో నిజంగా ఏపీ లో జరుగుతున్న నిర్ధారణ పరీక్షల్లో డొల్ల తనం ఉంటే ఏపీ మొత్తం వల్లకాడు అయ్యే పరిస్థితి ఉందని దీనిపై దృష్టి సారించాలని చాలా మంది మేధావులు వస్తున్న ఆరోపణలపై స్పందిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: