ఒక వైపే చూడు. రెండవ వైపు చూడాలనుకోకు అని ఒక సినిమాలో డైలాగ్ ఉంది. అలా ఒక వైపే చూడడం వల్లనే చంద్రబాబు రాజకీయ సినిమా చిరిగిపోయింది. అందుకే జగన్ ఇపుడు ఎక్కడా తడబాటూ, పొరపాటూ చేయకుండా  తెలివిగానే వ్యవహరిస్తున్నారు. రెండవ వైపు చూస్తున్నారు. ఏడాది పాలనంతా సాగిన తరువాత ప్రభుత్వం కొంత కుదుట పడిందని తెలుసుకున్నాక జగన్ ఇపుడు పార్టీ మీద ద్రుష్టి పెట్టారు. పార్టీలో ఈ మధ్యనే అలజడి సన్నగా కనిపిస్తోంది.

 నర్సాపురం ఎంపీ రఘురామక్రిష్ణం రాజు తిరుగుబాటు జెండా ఎగురవేశారు. అలాగే నెల్లూరు పెద్దాయన ఆనం రాంనారాయణరెడ్డి కూడా అసంత్రుప్తి గళం వినిపించారు. ఈ క్రమంలో  జగన్ తెలివిగానే అడుగు ముందుకేసారు. పార్టీలో అసమ్మతి రెచ్చిపోకుండా ఉండాలంటే పార్టీని ఎల్లవేళలా  కనిపెట్టుకుని ఉండే నేతలు ఉండాలని డిసైడ్ అయ్యారు. అందుకే ముగ్గురు సీనియర్ నేతలకు పార్టీ కీలక బాధ్యతలు  అప్పగించారు. ఈ ముగ్గురూ కూడా రాజకీయంగా గండరగండలే, జగన్ కి విశ్వాసపాత్రులే.

అందుకే సామాజిక సమీకరణలు వంటివేవీ పెట్టుకోకుండా జగన్ వారికి బాధ్యతలు అప్పగించారు. వారిని ఏపీని మూడు ముక్కలు విభాగాలుగా  జిల్లాల బాధ్యతలు అప్పగించారు. ఇక మీదట స్థానికంగా పార్టీ మంచి చెడ్డలు, అలకలు, అసంత్రుప్తులు వంటివి పార్టీలో వీరే చూసుకుంటారు. మరీ పెరిగి పెద్దది అయితే తప్ప జగన్ నేరుగా రంగంలోకి రారు.

ఇక జగన్ ఎమ్మెల్యేలకు టైం ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. వారికి అపాయింటెమెంట్ ఇవ్వడం ద్వారా పార్టీలో ఎవరు ఎలా అన్నది తాను తెలుసుకోవడమే కాకుండా వారికి ఏ మాత్రమైన బాధ, ఇబ్బందులు ఉంటే సెట్ చేయాలనుకుంటున్నారు. మొత్తం మీద చూసుకున్నపుడు పార్టీని పదికాలల పాటు అధికారంలో ఉంచేందుకు చేయాల్సిన కసరత్తుని జగన్ చేస్తున్నారు అంటున్నారు మరి చూడాలి దీని ఫలితాలు ఎలా ఉంటాయో.

Powered by Froala Editor

మరింత సమాచారం తెలుసుకోండి: