వైయస్ జగన్ కాంగ్రెస్ పార్టీలో నుండి బయటకు వచ్చేసిన తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ నుండి మొట్టమొదటి బయటకు వచ్చిన వ్యక్తి కొడాలి నాని. తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వైయస్ జగన్ వెంట నడిచారు. అప్పటినుండి కొడాలి నాని...వైయస్ జగన్ రాజకీయ జీవితంలో కీలక పాత్ర పోషిస్తూ ఆయన నమ్మిన బంటుగా పేరు తెచ్చుకున్నారు. స్వయంగా జగన్ ముఖ్యమంత్రి అయ్యాక నిండు అసెంబ్లీలో టీడీపీ వైసీపీ సభ్యులు అంత ఉండగా మాట్లాడుతూ నేను ఎక్కువగా నమ్మే నాయకులలో నా సహచరుడు నా శ్రేయోభిలాషి కొడాలి నాని అంటూ జగన్  చెప్పిన సందర్భం కూడా ఉంది.

 

అలాంటి కొడాలి నాని ఇటీవల మీడియా ముందు స్ట్రయిట్ ఫార్వర్డ్ గా దూకుడుగా మాట్లాడటం ఒక రకంగా వైసీపీ మద్దతు దారులకు పార్టీ కి ప్లస్ అయినాగానీ న్యూట్రల్ మనుషుల్లో ఆయన అనుసరిస్తున్న వైఖరి పార్టీకి నష్టం చేకూర్చే విధంగా ఉందని పరిశీలకులు అంటున్నారు. ఏం పీకుతాడు, బొచ్చు లోది అంటూ 40 ఏళ్ల అనుభవం మరియు మూడు సార్లు ముఖ్యమంత్రి చేసిన చంద్రబాబు ని నోటికొచ్చినట్టు తిట్టడం వంటి వాటిని నార్మల్ నెటిజన్లు వింటూ ఒక బాధ్యతగల మంత్రి పదవిలో ఉంటూ ఈ విధంగా వ్యాఖ్యలు చేయటం సమంజసం కాదని అంటున్నారు.

 

పైగా రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నా నిమ్మగడ్డ రమేష్ కుమార్ మళ్లీ పదవి చేపడతారు అంటే… పదవి చేపడితే ఎవరికైనా ఏమైనా ఊడాతయ అనే మాట తీరు పట్ల కూడా చాలా మంది సామాన్య ప్రజల నుండి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. మంచి మాస్ లీడర్ గా ఉన్న కొడాలి నాని మాట తీరు ఒక రకంగా ఆయన చుట్టూ ప్రజలకు ప్లస్ లాగా ఉన్నాగాని... కీలక పౌరసరఫరాల శాఖ మంత్రిపదవిలో  ఉండటంతో మరికొంత మందికి ఆయన మాట తీరు పై రాష్ట్రవ్యాప్తంగా మాత్రం చాలామంది ప్రజలు తీవ్ర స్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేస్తున్నరు అనే టాక్ బలంగా వినబడుతోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: