ఇటీవల ఏపీ రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన పిల్లి సుభాష్ చంద్రబోస్ మీడియాతో మాట్లాడుతూ స్పెషల్ స్టేటస్ గురించి కాంట్రవర్సీ కామెంట్ చేశారు.  దీంతో బోస్ చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో పెద్ద హాట్ టాపిక్ అయ్యాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ పార్టీ అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా తేస్తాను అని జగన్ హామీ ఇవ్వడం జరిగింది. అనుకున్నట్టుగానే జగన్ అధికారంలోకి వచ్చిన కేంద్రంలో బీజేపీ భారీ స్థాయిలో మెజార్టీ లో ఉండటంతో స్పెషల్ స్టేటస్  తీసుకు రాలేని పరిస్థితి ఏర్పడింది. ఇదే సమయంలో వైఎస్ జగన్ కూడా ప్రత్యేక హోదా విషయంలో బీజేపీ ని అడగడం తప్ప నిలదీయడం అనేది కష్టం అని చేతులెత్తేసినట్లే అన్నట్టుగా జగన్ మాట్లాడారు.

 

మరోపక్క బీజేపీ కూడా ప్రత్యేక హోదా అనే హామీ ముగిసిన అధ్యాయం అని చెప్పడం జరిగింది. దీంతో చాలా వరకు ఎవ్వరు ప్రత్యేక హోదా గురించి రాష్ట్రంలో ప్రజలు గాని ప్రతిపక్షాలు గానిమాట్లాడలేని సమయములో పట్టించుకోని గ్రామములో సుభాష్ చంద్రబోస్ మీడియాతో మాట్లాడుతూ ప్రత్యేక హోదా కోసం సీఎం జగన్ సుధీర్ఘ పోరాటం చేశారని, అయితే రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తుందనే నమ్మకం తనకైతే లేదని అన్నారు. అయితే ఇది కేవలం తన వ్యక్తిగత అభిప్రాయం మాత్రమేనని అన్నారు.

 

దీంతో ఇప్పుడు విపక్ష పార్టీలు మరియు ప్రజలు స్పెషల్ స్టేటస్ గురించి ప్రభుత్వాన్ని ప్రశ్నించే విధంగా మాట్లాడుతున్నారు. దీంతో బిజెపి నాయకులు కూడా సుభాష్ చంద్రబోస్ చేసిన వ్యాఖ్యలు పట్ల ఢిల్లీ హై కమాండ్ కి ఫిర్యాదు చేయాలని డిసైడ్ అవుతున్నారట. ఇలాంటి నేపథ్యంలో విషయం పెద్దదవుతుందనే వైసీపీ హైకమాండ్ ఈ విషయంలో సరిదిద్దుకునే చర్య చేపట్టనున్నట్లు సమాచారం. ఇప్పుడిప్పుడే బీజేపీ...వైసీపీ తో కలిసి రాజకీయాలు చేయాలని దృఢ నిశ్చయంతో ఉన్న టైంలో ఇలాంటి పరిణామాలు వల్ల పార్టీకి రాష్ట్రానికి నష్టం చేకూరుతుందని వైసీపీ నేతలు డామేజ్ జరగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి: