అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి సరికొత్త పథకాలు అమలు చేస్తూ, సంచలన నిర్ణయాలు తీసుకుంటూ ఏపీ రాజకీయాల్లో కొత్త చరిత్ర సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ఆయన ప్రతి అడుగు ఓ సంచలనమే అవుతుంది. మూడు రాజధానులు, మండలి రద్దు లాంటి సంచలన నిర్ణయాలతో పాటు.. అసలు ఏపీ చరిత్రలో ఏ సీఎం చేయని విధంగా పథకాలు అమలు చేస్తున్నారు.

 

ఏడాది సమయంలోనే ఊహించని విధంగా పథకాలు అందించారు. ముఖ్యంగా దేశంలో ఎక్కడా లేని అమ్మఒడి పథకం తీసుకొచ్చి సంచలనం సృష్టించారు. అయితే త్వరలోనే 30 లక్షల పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తూ...జగన్ కొత్త చరిత్ర రాయబోతున్నారని వైసీపీ శ్రేణులు చెబుతున్నాయి. దివంగత వైఎస్సార్ జయంతి సందర్భంగా జూలై 8న జగన్ పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేయబోతున్నారు. నియోజకవర్గాల్లో వైసీపీ నేతలు, కార్యకర్తలు ఈ కార్యక్రమాన్ని పండగలా చేయడానికి సిద్ధమవుతున్నారు.

 

ఇక ఈ స్థాయిలో ఇళ్ల పట్టాల పంపిణీ దేశంలో ఎక్కడా జరగలేదు. కేవలం జగన్ వల్లే ఇది సాధ్యమవుతుంది. పైగా అదే స్థాయిలో ఇళ్ల స్థలాల్లో పేదలకు ఉచితంగా ఇళ్ళు కట్టించాలని ప్లాన్ చేస్తున్నారు. నాలుగేళ్లలో రాష్ట్రంలో ఇల్లు లేని ప్రజలు ఉండకూడదనే ఉద్దేశంతో జగన్ పనిచేస్తున్నారు. అయితే ఎన్టీఆర్ సీఎంగా ఉన్నప్పటి నుంచి ఈ ఇళ్ళు కట్టించే కార్యక్రమం జరుగుతుంది.

 

కానీ వైఎస్సార్ సీఎం అయ్యాక పెద్ద మొత్తంలో ఉమ్మడి ఏపీలో ఇందిరమ్మ గృహా నిర్మాణాలు చేశారు. ఇక మొన్న చంద్రబాబు హయాంలో కూడా చెప్పుకోదగిన విధంగానే ఇళ్ల నిర్మాణాలు జరిగాయి.  అయితే ఎవరు ఎన్ని కట్టించినా కూడా...ఇంకా ఏపీలో చాలామందికి సరైన ఇళ్ళు లేక ఇబ్బందులు పడుతున్నారు.

 

అయితే ఇళ్లే కాదు స్థలాలు కూడా లేని పేదలు చాలామంది ఉన్నారని జగన్ గుర్తించారు. అందుకే ఉచితంగా స్థలాలు కూడా కేటాయించి, అందులో మంచి వసతులతో ఇళ్ళు కట్టించాలని సీఎం జగన్ నిర్ణయించుకుని, ఆ కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేసే విధంగా ముందుకెళుతున్నారు. ఇక ఈ కార్యక్రమం ఏపీలో సరికొత్త చరిత్ర సృష్టించనుందని, ఇక ఈ చరిత్రని ఎవరు తిరగరాయలేరని వైసీపీ నేతలు ధీమాగా చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: