ప్రపంచానికి చైనా దేశం ఎల్లప్పుడూ నీతిబోధనలు చేస్తూ ఉంటుంది. అయితే చైనా చెప్పే మాటలకు చేతలకు పొంతనే ఉండదు. కొన్ని రోజుల క్రితం భారత్ చైనా యాప్ లను నిషేధించిన సంగతి తెలిసిందే. టిక్ టాక్ తో సహా 59 చైనా యాప్ లపై భారత్ బ్యాన్ విధించింది. నిబంధనలు పాటించడం లేదనే కారణంతో భారత్ వాటిపై నిషేధం విధించింది. అయితే భారత్ చైనా యాప్ లను నిషేధించడంపై ఆ దేశం ఇది ప్రపంచీకరణ ఆలోచనలకు ప్రమాదం అని చెప్పింది. 
 
యాప్ లను రద్దు చేయడం ద్వారా దేశాల మధ్య సన్నిహిత సంబంధాలు దెబ్బ తింటాయని..... ఆ సంబంధాలను ఎందుకు చెడగొట్టుకోవాలని భారత్ ప్రయత్నిస్తోందని.... ఇది భారత్ పునరాలోచించుకోవాలని ఆందోళన వ్యక్తం చేసింది. ఆర్థిక కోణంలో చైనా ఎటువంటి వ్యాఖ్యలు చేయకుండా సంబంధాల కోణంలోనే ఈ వ్యాఖ్యలు చేసింది. అయితే చైనా వార్తా పత్రికలు, వెబ్ సైట్లపై భారత్ ఎలాంటి నిషేధం విధించలేదు. 
 
ఐతే చైనా మాత్రం భారత్ మీడియాకు సంబంధించిన వెబ్ సైట్లపై అక్కడ బ్యాన్ విధించింది. ఇకపై ఎవరైన భారతీయ వెబ్ సైట్లు పొందాలంటే కూడా వీ.పీఎ.ఎన్ సర్వర్ నుంచి స్పందించాల్సి ఉంటుంది. చైనాలో ఐపీ టీవీ ద్వారా మాత్రమే మన దేశపు ఛానెళ్లను చూసే వీలు ఉంటుంది. ఐ ఫోన్, డెస్క్ టాప్ లలో ఎక్స్ ప్రెస్ వీపీఎన్ గత రెండు రోజులుగా చైనా ఆ దేశంలోని యూజర్లకు పని చేయకుండా చేసింది. 
 
చైనాకు చెందిన యాప్ లపై నిషేధం విధించటంతో ప్రతీకారం తీర్చుకోవాలని భావించి ఆ దేశం ఈ నిర్ణయం తీసుకుంది. గతంలో చైనా భారత్ కు దమ్ముంటే యాప్ లపై నిషేధం విధించాలని సవాల్ విసిరింది. అయితే భారత్ యాప్ లను బ్యాన్ చేసేసరికి తెరవెనుక నాటకాలను మొదలుపెట్టింది. ప్రపంచానికి నీతులు చెప్పే చైనా తెరవెనుక మాత్రం గోతులు తవ్వుతోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: