ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో రోజురోజుకు కరోనా  వైరస్ కేసుల సంఖ్య పెరిగిపోతుంది అన్న  విషయం తెలిసిందే. విజృంభిస్తున్న  ఈ మహమ్మారి వైరస్ ఎంతో మందిని బలితీసుకుంది. మొన్నటి వరకు అతి తక్కువ టెస్ట్ లు  చేసిన తెలంగాణ సర్కార్ ప్రస్తుతం ఎక్కువ వటెస్టులు  చేస్తున్న నేపథ్యంలో మరింత ఎక్కువగా కేసులు కూడా నమోదు అవుతున్నాయి.  అయితే ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో నమోదవుతున్న 90 శాతం కేసులు కేవలం జీహెచ్ఎంసీ పరిధిలోని ఉన్న విషయం తెలిసిందే, కేవలం హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాల్లోని ఈ మహమ్మారి వైరస్ కేసుల సంఖ్య భారీగా ఉంది. 

 

 జిహెచ్ఎంసి పరిధిలో రోజురోజుకు కేసులు పెరుగుతున్న తరుణంలో త్వరలో నగరంలో లాక్ డౌన్ విధించే అవకాశం ఉంది అంటూ ఈ వార్త సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తోంది. అయితే ఇది ఎంతో మంది ప్రజలను కలవరానికి గురిచేస్తోంది అనే విషయం తెలిసిందే. ప్రస్తుతం హైదరాబాద్ నగరానికి వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి కూడా ఉపాధి పొందుతున్న వారు చాలా మంది ఉన్నారు. ముఖ్యంగా మరో తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ నుంచి ఎంతో మంది విద్యార్థులు.. ఉద్యోగులు హైదరాబాద్ లో ప్రస్తుతం ఉపాధి పొందుతూ జీవిస్తున్నారు. 


 అయితే గతంలోనే లాక్ డౌన్  విధించిన సమయంలో వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది  ప్రస్తుతం  లాక్ డౌన్ విధిస్తారు అనే వార్తలు వస్తున్న నేపథ్యంలో మళ్లీ తిరిగి ఆంధ్రకి  ప్రయాణం అవుతున్నారు చాలామంది. మొన్నటికి మొన్న కేసీఆర్ కూడా లాక్ డౌన్ విధించే అవకాశం ఉంది అన్నట్లుగా వ్యాఖ్యలు చేయడం కూడా ఆంధ్ర ప్రజలు మరింత కలవరానికి గురి చేస్తోంది. ఈ నేపథ్యంలో మరోసారి ముల్లా మూట సర్దుకుని ఆంధ్రాకు పయనమవుతున్నారు. దాదాపుగా అందరూ ప్రస్తుతం ఆంధ్రలోని తమ స్వస్థలాలకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: