పరీక్షలు వస్తే ఎవరికైనా ఇరకాటమే. అయితే అలాంటి ఇలాంటి పరీక్షలు కాకుండా అగ్ని పరీక్షలే వస్తే ఇక తట్టుకోగలమా. ఇపుడు హస్తిన వేదికగా అదే జరుగుతోంది అంటున్నారు. వైసీపీ అధినాయకత్వానికి  పంటి కింద రాయిలా మారిన నర్సాపురం ఎంపీ రఘురామక్రిష్ణం రాజు మీద వేటు వేయాలని వైసీపీ గట్టిగా కోరుతోంది.

 

ఈ విషయంలో ఢిలీలి ప్రత్యేక టీం ఏపీ నుంచి బయల్దేరి వెళ్తోంది. ఈ టీంలో వైసీపీ ఎంపీలతో పాటు, పలువురు న్యాయవాదులు కూడా ఉంటారని సమాచారం. వీరంతా కలసి లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాతో భేటీ అవుతారు. అక్కడ ఆయనకు రఘురామ క్రిష్ణం రాజు పైన అనర్హత వేటు వేయాలని వైసీపీ ఎంపీలు  కోరుతారు.

 

అయితే ఒక పార్టీ తరఫున గెలిచిన సభ్యుడు పార్టీకి విరుధ్ధంగా కామెంట్స్ చేస్తూ అధినాయకత్వాన్ని ధిక్కరిస్తూ ఉంటే దానికి తగిన ఆధారాలు ఉంటే మాత్రం కచ్చితంగా స్పీకర్ నిర్ణయం తీసుకుంటారు. అయితే ఇక్కడ స్పీకర్ కి విచక్షణ అధికారం ఉంటుంది.  ఆయన వెంటనే నిర్ణయం తీసుకోవాలని లేదు.

 

ఆయన కాలపరిమితిని, విచక్షణను కోర్టులు కూడా ప్రశ్నించజాలవు. ఇక్కడ లోక్ సభ స్పీకర్ బీజేపీ మనిషి. ఎవరు అవునన్నా కాదన్నా ఆయన నిర్ణయం మీ ద కొంత పార్టీ ప్రభావం ఉంటుంది. ఇక రఘురామ క్రిష్ణం రాజు అయితే ఇప్పటికే  మోడీ గానం చేస్తున్నారు. ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి వున్నారు. తన బాధలు,కష్టాలు చెప్పుకున్నారు.

 

మరి ఇపుడు బీజేపీకి ఓ విధంగా ఇది విషమ పరీక్షగానే ఉంటుంది. ఓ వైపు లోక్ సభలో నాలుగవ పెద్ద పార్టీగా వైసీపీ ఉంది. రాజ్యసభలో ఆరవ పెద్ద పార్టీగా ఆరుగురు ఎంపీలు ఉన్నారు. పెద్దల సభలో బీజేపీకి వైసీపీ గట్టి  మద్దతు కావాలి. ఈ నేపధ్యంలో చూసుకున్నపుడు ఏపీ రాజకీయాల్లో రాజు గారిపై వేటు వైసీపీకి కావాలి. మరి బీజేపీ ఏ విధంగా నిర్ణయం తీసుకుంటుంది అన్నది చూడాలి. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: