చైనా ఏదో అనుకుంటే ఏదో అయింది. అవును అదిలాగే అవుతుంది. ఎపుడూ అద్దాల మేడల్లో ఉన్నవారు బీరాలు పలకరదు, బిగిరి మరీ మాట్లాడరాదు. ఇక మనకు ఎదురులేదు అని కూడా అనుకోరాదు, అనుకుంటే పరిణామాలు ఇలాగే ఉంటాయి. అయినా కానే చైనా ప్రపంచంలో అగ్ర రాజ్యంగా ఎదగాలనుకుంటే దానికి మార్గం ఇదా.

 

పక్కన ఉన్న భారతదేశంతో సయోధ్య పెట్టుకోకుండా అది ఎలా కుదురుతుంది. ఆసియా దేశాల మద్దతు లేకుండా స్వర్గానికి ఎలా ఎగరగలను అని చైనా అనుకుంది. అయినా కరోనా వైరస్ ని ప్రపంచానికి అంటించిన డ్రాగన్ దుష్ట రాజకీయ  క్రీడల మీద మొత్తం లోకం కోపంతో ఊగిపోతోంది. అలాటపుడు ఎంత నిదానంగా ఉండాలి కానీ తెంపరితనమే తన బ్రాండ్ గా చేసుకుని దూసుకుపోవడమే తప్ప ముక్కు పగిలిపోతుంది అన్న ఆలోచన లేకుండా చైనా  చేసుకున్న ఫలితమే ఇపుడు ఇలా జరిగింది అంటున్నారు.

 

సరే ఇవన్నీ ఇలా ఉంటే ఇపుడు చైనాకు భారీ ఆర్ధిక  నష్టం తెచ్చేందుకు భారత్ వేస్తున్న ఎత్తులతో డ్రాగన్ చిత్తు అవుతోంది. ఇప్పటికే 59 యాప్స్ ని రద్దు చేయడంతో  చైనా గింగిరాలు కొడుతోంది. ముఖ్యంగా టిక్ టాక్ యాప్ తో  ఏకంగా 45 వేల కోట్లు చైనా నష్టపోయిందట. ఇదొక్కటే కాదు, భారత్ లో కాంట్రాక్టులు, ఇతర ఆర్ధిక ఒప్పందాలు అన్నీ వరసగా రద్దు అవుతున్నాయి.

 

దాంతో డ్రాగన్ కి చుక్కలు  కనిపిస్తున్నాయి. మొత్తానికి చూసుకుంటే లక్ష కోట్ల వరకూ ఇప్పటికిపుడు చైనాకు నష్టం చేయాలని మోడీ సర్కార్ గట్టిగా ఆలోచన చేస్తోంది. అసలే కరోనా వైరస్ దెబ్బకు గింజుకుంటోంది చైనా. దేశం నుంచి పెట్టుబడులు తరలిపోతున్నాయి.భారత్ యాప్స్ రద్దు చేయడం, భారీ ఎత్తున పెట్టుబడులు కాదనడంతో అమెరికా వంటి దేశాలు కూడా అదను చూసి దెబ్బ కొడుతున్నాయి. ఇవన్నీ చూసుకున్నపుడు భారత్ తో ఎందుకు పెట్టుకున్నానురా దేవుడా అని చైనా అనుకుంటోందిట. మొత్తానికి ఇప్పటికైనా బుధ్ధి వచ్చిందా లేక ఇలాగే బుర్ర తిరుగుడుతో  చైనా ఉంటుందా అన్నది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: