ఈ భూమి పుట్టినప్పటి నుంచి మానవుడు ఎన్నో వ్యాధులతో పోరాడాడు. కానీ ఇంత టెక్నాలజీ పెరిగిన తర్వాత ఇప్పుడు ఎందుకు కరోనాకు భయపడుతున్నాడు. లక్షల మంది చనిపోతున్నా ఎలా చూస్తూ ఉండిపోతున్నాడు. అందుకు కారణం.. దీనికి ఇంకా మందు, వ్యాక్సీన్ కనిపెట్టకపోవడమే.

 

 

ఈలోపే ఈ మహమ్మారి వ్యాపించడమే. అయితే కరోనాకు వ్యాక్సీన్ కనిపెట్టడం అంత కష్టమేమీ కాదు.. కానీ టైమ్ తీసుకుంటుంది.. అప్పటి వరకూ కరోనా మారణ హోమం తప్పదు. పరిస్థితి ఇలా ఉంటే.. ఇప్పుడు కరోనా విషయంలో వరుసగా శుభవార్తలు వినిపిస్తున్నాయి.

 

 

కరోనాకు వ్యాక్సీన్ త్వరలోనే వచ్చే అవకాశాలు మెరుగయ్యాయి. అనేక సంస్థలు తాము కరోనా వ్యాక్సీన్ రూపొందించడంలో గణనీయమైన పురోగతి సాధించామని ప్రకటించాయి. తాజాగా.. ఫైజర్ , బయోఎన్ టెక్ సంయుక్తంగా అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ క్యాండిడేట్ ప్రాథమిక క్లీనికల్ ట్రయల్స్ లో చక్కటి ఫలితాలు ఇస్తున్నట్లు శాస్త్రవేత్తలు ప్రకటించారు.

 

 

ఈ వ్యాక్సిన్ క్యాండిడేట్ తో రోగుల శరీరంలో యాంటీ బాడీస్ పెరుగుతున్నట్లు తేలిందట. ఈ వ్యాక్సిన్ క్యాండిడేట్ తయారీలో పాల్గొన్న శాస్త్రవేత్తలు ఈ విషయం తెలిపారు. ఈ వ్యాక్సినేషన్ రెండు డోస్ లు తీసుకున్న వారిలో.. ప్లాస్మాథెరపి చేయించుకున్న వారికంటే ఎక్కువ స్థాయిలో యాంటీబాడీలు ఉత్పత్తి అవుతున్నట్లు తేల్చారు. వ్యాక్సిన్ క్యాండిడేట్ తీసుకున్న వారిలో సార్స్ కొవిడ్ -2 ని న్యూట్రలైజ్ చేసే యాంటీబాడీలు 1.8 నుంచి 2.8 రెట్లు అధికంగా విడుదలయ్యాయట.

 

మరింత సమాచారం తెలుసుకోండి: