ఇటీవల తరచుగా వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోర్టుల్లో తీర్పులు వస్తున్నాయి. ప్రతిపక్షనేత చంద్రబాబు కోర్టులను మేనేజ్ చేస్తున్నారని వైసీపీ నేతలు ఆరోపించారు. ఇక వైసీపీ కార్యకర్తలైతే మరింతగా రెచ్చిపోయి.. న్యాయమూర్తిలపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. చివరకు అదంతా ఓ కేసుగా మారి హైకోర్టులో విచారణలో ఉంది. సరిగ్గా ఇలాంటి సమయంలో వైసీపీకి చెందిన ఓ పెద్దాయన ఈ వివాదంలో ఏకంగా పెట్రోలే పోసేశారు.

 

 

అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారామ్ ఏకంగా న్యాయస్థానాలే టార్గెట్ చేసి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అన్ని న్యాయస్థానాలే చేస్తే ప్రజలు ఎందుకు ఎన్నికలు ఎందుకు, ముఖ్యమంత్రి ఎందుకు, స్పీకర్ ఎందుకు, పార్లమెంటు సభ్యులు ఎందుకు, ఎమ్మెల్యేలు ఎందుకు? అన్నీ మీరే నిర్ణయాలు చేస్తారా?పాలన విదానాలలో కూడా కోర్టులే జోక్యం చేసుకుంటున్నాయి. ఇది మంచిది కాదు. ఒక వ్యవస్థ మరో వ్యవస్థలో జోక్యం చేసుకోకూడదు అన్నారు.

 

 

అంతే కాదు.. వ్యవస్థలపై నమ్మకంతో ఆనాటి రాజ్యాంగ నిర్మాతలు రాజ్యాంగాన్ని తయారు చేశారు.. ఇలాంటి తీర్పులు వస్తాయని, కోర్టులే అన్నిటిలో ఆదేశాలు ఇస్తాయని రాజ్యాంగ నిర్మాతలు ఊహించి ఉంటే.. ఇందుకు కూడా ప్రత్యామ్నాయం పెట్టి ఉండేవారేమోనని సీతారామ్ కామెంట్ చేశారు. డైరెక్ట్ గా మీరే రూల్ చేస్తారా? అన్నిటిలో మీరే జోక్యం చేసుకుంటారా అని సీతారామ్ ప్రశ్నించారు.

 

 

ఆంధ్రప్రదేశ్‌లో చిత్రమైన పరిస్థితి ఉంటోందని, వికృత రాజకీయాలు జరుగుతున్నాయని, చివరికి ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికి లేకుండా ద్రవ్య వినిమయ బిల్లును కూడా ప్రతిపక్షం వారు అడ్డుకున్నారని సీతారామ్ ఆవేదన వ్యక్తం చేశారు. మరి రాజ్యాంగబద్ద పదవిలో ఉన్న స్పీకర్ న్యాయవ్యవస్థపై చేసిన ఈ వ్యాఖ్యలు ఎలాంటి మలుపు తీసుకుంటాయో చూడాలి.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: