పాదయాత్ర చేపట్టి, ఆ తర్వాత ఎన్నికలకు వెళ్లిన వారు ఎవరూ, ఇప్పటి వరకు ఓటమి చెందిన చరిత్ర ఏపీలో లేకపోవడంతో, ఆ సెంటిమెంట్ ను అందరూ ఫాలో అవుతూ వస్తున్నారు. గతంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర కు నాంది పలికి రాష్ట్రమంతా పర్యటించారు. ఆ పాదయాత్ర భారీగా సక్సెస్ అవడం, రాజశేఖర్ రెడ్డి తిరుగులేని నాయకుడిగా నిరూపించుకోవడంతో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆయనకు సీఎం కుర్చీ కట్టబెట్టింది. ఇక ఆ తరువాత టీడీపీ అధినేత చంద్రబాబు సైతం పాదయాత్రనే నమ్ముకున్నారు. ఆయన తర్వాత వైసీపీ అధినేత జగన్ కూడా పాదయాత్ర పేరుతో ప్రజల్లోకి వెళ్లారు. ఆ తర్వాత ఎన్నికల్లో భారీ మెజారిటీతో ఏపీలో వైసీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగారు. ఈ పాదయాత్ర సెంటిమెంట్ బాగా సక్సెస్ అయినట్టుగా కనిపించడంతో, ఇప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాదయాత్ర చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నారు.

 

అసలు ఆయన పాదయాత్ర చేపట్టాలని ఎప్పుడో డిసైడ్ అయినా, ప్రస్తుతం కరోనా ప్రభావం తీవ్రస్థాయిలో ఉండడం, ఇప్పట్లో ఈ వైరస్ ప్రభావం తగ్గేలా కనిపించకపోవడం వంటి పరిణామాలతో, 2022 నాటికి పవన్ పాదయాత్ర చేపట్టి ఎన్నికలు సమీపించే సమయానికి క్షేత్ర స్థాయిలో పార్టీని బలపరచాలని ఆయన నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. 2020 లో ఎలాగు కరోనా హడావుడి ఉంటుందని, 2021లో సినిమాలు, ఇంకా ఇతర వ్యవహారాలను చక్కబెట్టుకుని, 2020 నాటికి పూర్తిగా రాజకీయాలపై దృష్టి పెట్టి ప్రజల్లోకి వెళ్లాలని ఆయన డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. ఈ మేరకు కేంద్ర అధికార పార్టీ బీజేపీ కూడా పవన్ కు అన్ని విధాలుగా సహకరించి, ఆ పాదయాత్ర సక్సెస్ అయ్యేందుకు  రూట్ మ్యాప్ సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.

 

పవన్ బలపడితే, క్రమక్రమంగా బీజేపీ కూడా పుంజుకుంటుందని, ఎలాగూ, రెండు పార్టీలు కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తాము కాబట్టి, ఏపీలో అధికారం దక్కించుకోవచ్చు అనే విధంగా బిజెపి ప్లాన్ చేస్తున్నట్టు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కాకపోతే బలమైన ప్రత్యర్థి గా టిడిపి, వైసిపి పార్టీలను ఎదుర్కుని బిజెపి, జనసేన పార్టీలు అధికారం దక్కించుకోవడం అంత ఆషామాషీ వ్యవహారం అయితే కాదు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: