తెలుగుదేశం పార్టీలో బెజవాడ ప్రాంతానికి చెందిన నాయకులు చాలా కీలకంగా వ్యవహరిస్తారు అనే టాక్ ఎప్పటి నుండో ఉంది. అంతేకాకుండా ఆ ప్రాంతానికి చెందిన వారికే చంద్రబాబు కూడా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు అని చాలామంది తెలుగు సీనియర్ రాజకీయ నేతలు చెబుతుంటారు. అటువంటిది 2019 ఎన్నికలలో చంద్రబాబు దారుణంగా ఓడిపోయిన తర్వాత పార్టీ లో పరిస్థితి పూర్తిగా మారిపోయింది అంతకుముందు అధికారంలో ఉన్న టైంలో బెజవాడ ప్రాంతానికి చెందిన నాయకులు దేవినేని ఉమా, వర్ల రామయ్య ఇంకా బుద్దా వెంకన్న లాంటి నాయకులు ఎప్పుడూ మీడియా ముందు తెగ హడావిడి చేసేవారు. అప్పట్లో ప్రతిపక్షం పై తీవ్రస్థాయిలో మండిపడుతూ టీడీపీ ప్రభుత్వ కార్యక్రమాలను చంద్రబాబు పనితీరు గురించి చాలా గొప్పగా చెప్పే వాళ్ళు.

 

కానీ ఎప్పుడైతే గత సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ చిత్తు చిత్తుగా ఓడిపోవడం జరిగిందో ఈ బెజవాడ ప్రాంతానికి చెందిన నాయకులు మీడియా ముందు కనబడటం చాలా అరుదుగా మారింది. కానీ ఇటువంటి క్లిష్ట సమయంలో తెలుగుదేశం పార్టీ వాయిస్ బలంగా వినిపిస్తున్నది అదే బెజవాడ ప్రాంతానికి చెందిన టీడీపీ నాయకుడు పట్టాభి. ఇటీవల అధికారంలో ఉన్న జగన్ పార్టీపై 108,104 అంబులెన్స్ కుంభకోణం అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ అనేక ఆరోపణలు చేయడం జరిగింది. అదే రీతిలో జగన్ సిమెంట్ ఫ్యాక్టరీ లు అంటూ ఆయన సతీమణి భారతి పై కూడా నిరాధార ఆరోపణలు చేయడం జరిగింది.

 

అయినా గాని ప్రజల నుండి గాని ఇతర పార్టీల నుండి గాని పట్టాభి చేసిన వ్యాఖ్యల పట్ల సరైన స్పందన రాకపోయినా పట్టాభి మాత్రం పట్టువదలని విక్రమార్కుడిలా మీడియా ముందు ఆయన చేస్తున్న ఆరోపణలు కష్టం చూసి బాగా కష్ట పడుతున్నాడు మనిషి అని వైసిపి పార్టీ మద్దతుదారులు ఆయన పై సెటైర్లు వేస్తున్నారు. ఏదిఏమైనా పట్టాభి జగన్ ప్రభుత్వం పై విమర్శలు చేయడం కేవలం చంద్రబాబు దృష్టిని తనపై ఆకర్షించి కోవడం కోసమే అని విపక్ష పార్టీలకు చెందిన నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: