ఆంధ్రప్రదేశ్ సహా తెలంగాణాలో టీడీపీకి ఇప్పుడు భావిష్యత్తు లేదు అనే విషయం స్పష్టంగా అర్ధమవుతోంది. ఆ పార్టీ ఇప్పుడు నిలబడటం గెలవడం అన్నీ కూడా ఒక సంచలనమే. ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు వైఖరిలో మార్పు రాని అన్ని రోజులు కూడా ఆ పార్టీ నిలబడటం అనేది కాస్త కష్టమే అని చెప్పాలి. ఆ పార్టీకి క్షేత్ర స్థాయిలో బలమైన దెబ్బ తగిలే అవకాశం ఉంది అని పరిశీలకులు అంటున్నారు. పార్టీ గ‌త ‌యేడాది జ‌రిగిన ఎన్నిక‌ల్లో ఘోరంగా ఓడిపోయిన‌ప్ప‌ట‌కీ చంద్ర‌బాబు తీరుతో మార్పు లేక‌పోవ‌డంతోనే పలువురు కీల‌క నేత‌లు ఇప్పుడు పార్టీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చేస్తున్నారు.

 

ఈ క్ర‌మంలోనే టీడీపీని ఇప్పుడు క్షేత్ర స్థాయిలో బలమైన దెబ్బ కొట్టే విధంగా సిఎం జగన్  ప్లాన్ చేసారు అని పరిశీలకులు అంటున్నారు. అవును ఇప్పుడు ఆ విధంగానే పావులు కదుపుతున్నారు అని టాక్. ప్రశాంత్ కిషోర్ టీం ని గ్రౌండ్ లెవెల్ లో రంగం లోకి దింపి టీడీపీ లో ఎవరు అయితే యాక్టివ్ గా ఉంటారో వారిని టార్గెట్ చేసే అవకాశం ఉంది అని ప్రచారం జరుగుతుంది. వారు అందరిని కూడా పార్టీ మారే విధంగా స్కెచ్ వేస్తున్నారట. 

 

గుంటూరు ప్రకాశం, కృష్ణా జిల్లాలు, అనంతపురం సహా ఉభయగోదావరి జిల్లాల్లో ఆ పార్టీకి బలమైన క్యాడర్ ఉంది. ఇప్పుడు దీనిని టార్గెట్ గా చేసుకునే అడుగులు వేస్తున్నారు అని అంటున్నారు. మరి ఏం జరుగుతుంది ఏంటీ అనేది చూడాలి. ప్రశాంత్ కిషోర్ టీం బూత్ లెవెల్ నుంచి టార్గెట్ చేసే అవకాశాలు ఉన్నాయని పరిశీలకులు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: