అమెరికాలో సత్తా చాటుకోవడం మన ఇండియన్లకు కొత్తకాదు.. తాజాగా మరో ఇద్దరు ఇండియన్లు అరుదైన గౌరవం అందుకున్నారు. అందులోనూ ప్రపంచమంతా కరోనాతో పోరాడుతున్న సమయంలో అదే అంశంపై అక్కడి ప్రభుత్వం మనసు గెలుచుకున్నారు.

 

 

కరోనా వ్యాప్తిని తగ్గించేందుకు కృషి చేసినందుకు సిద్దార్థ ముఖర్జీ, రాజ్ చెట్టిలను 2020 గ్రేట్ ఇమ్మిగ్రెంట్స్ పురస్కారం వరించింది. వీరితోపాటు మరో 38 మంది వలసదారులకు అమెరికన్ స్వాతంత్ర దినోత్సవం రోజున ఈ పురస్కారాన్ని ప్రదానం చేస్తారు. మరి ఇంతకీ ఈ ఇద్దరి నేపథ్యం ఏంటి.. ఓసారి చూద్దాం..

 

 

సిద్దార్థ్‌ ముఖర్జీ.. ఈయన్ను ఇప్పటికే పులిట్జర్ అవార్డు వరించింది. ప్రముఖ క్యాన్సర్ నిపుణుడు. సిద్దార్థ ముఖర్జీ కొలంబియా యూనివర్సిటీ ఉపాధ్యాయ వృత్తి చేస్తున్నారు. అలాగే న్యూయార్క్ లో ఓ అసుపత్రిలోనూ వైద్యసేవలు అందిస్తున్నారు. ఈ ముఖర్జీని భారత ప్రభుత్వం 2014లో పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది కూడా.

 

 

ఇక మరొకరు రాజ్‌ చెట్టి. ఈయన హర్వర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ గా పని చేస్తున్నారు. అమెరికాలో కరోనా వ్యాపారం, ఇతర కార్యకలాపాలపై ఏ విధంగా ఆర్థిక ప్రభావం చూపిందనే దానిపై పర్యవేక్షించటంలో సహాయపడుతున్నారు. కరోనా సమయంలో వీరిద్దరినీ ఈ పురస్కారాలు వరించడం ఇండియాకు గర్వకారణంగా చెప్పుకోవచ్చు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: