తెలుగు దేశం.. పేరులోనే తెలుగు ఉన్న ఘనమైన పార్టీ. నిజంగానే ఆ పార్టీని స్థాపించిన నందమూరి తారక రామారావు.. నిలువెత్తు తెలుగు రత్నంగా భాసిల్లారు. ఆయన పాలనలో తెలుగుతనానికి పెద్ద పీట వేశారు. తెలుగు భాష అభివృద్ధికి అన్నివిధాలా కృషి చేశారు. తెలుగు సాహిత్యాన్ని ఆదరించారు. ఆయన ఓ నిలువెత్తు తెలుగు ఠీవిగా నిలిచారు.

 

 

అయితే అదంతా ఘనమైన గతం.. ఇప్పుడు నడుస్తున్నది నందమూరి వారి పార్టీ కాదు.. నారా వారా పార్టీ. వారికి తెలుగుపై అంత పట్టింపు కనిపించదు. తారక రాముని పేరు చెప్పుకుని దాన్ని కొనసాగిస్తున్నారు. అయితే తెలుగుభాష పట్ల మిగిలిన పార్టీల సంగతి ఎలా ఉన్నా.. కనీసం తెలుగు దేశం పార్టీ అయినా కాస్త పట్టింపు చూపించాల్సిన అవసరం ఉంది. కానీ ఈ ప్లకార్డు చూస్తే తెలుగు భాషాభిమానులు తల నేలకు కొట్టుకునే ప్రమాదం ఉంది.

 

 

మాజీ మంత్రి అచ్చెన్నాయుడిని జైలు నుంచి ఆసుపత్రికి తరలించాలంటూ గురువారం తెలుగు దేశం రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేసింది. ఆందోళన సమయంలో ప్ల కార్డులు ఓ తప్పనిసరి తంతు కదా.. ఓ ప్ల కార్డు రూపొందించారు. దానిపై ఏమని ఉందో తెలుసా.. “ అచ్చెం నాయుడు గారికి ప్రాణహానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి" మీకు ఏమైనా అర్థం అయ్యిందా.. ?

 

 

పార్టీ ప్రధాన కార్యాలయంలో జరుగుతున్న ధర్నాలో సొంత పార్టీ పేరు కూడా సరిగ్గా రాయలేకపోవడం ఏంటో.. అచ్చెన్నాయుడుకు బదులుగా అచ్చెం నాయుడు అని రాశారు. సరే..ఏదో అక్షర దోషం అంత మాత్రానికేనా అంటారా.. సరే పోనిద్దాం.. మరి ప్రాణహానికి ప్రభుత్వం బాధ్యత వహించడం ఏంటండీ బాబూ.. అంటే ప్రాణహాని జరిగిపోయిందా.. జరగబోతోందా.. ఏంటి దాని అర్థం..? లేకపోతే.. అచ్చెన్నాయుడికి ప్రాణహాని తలపెట్టకపోతే మేము ఊరుకోబోమని హెచ్చరిస్తున్నారా.. హేమిటో.. ఈ తెలుగు దేశం నాయకుల తెలుగు తెగులు.. !?

 

మరింత సమాచారం తెలుసుకోండి: