ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. కర్నూలు, కృష్ణా జిల్లాల్లో వైరస్ శరవేగంగా వ్యాప్తి చెందుతోంది. ప్రభుత్వం కేసులు నమోదైన ప్రాంతాల్లో నిబంధనలు కఠినంగా అమలు చేస్తున్నా కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. కరోనా పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయిన‌ప్ప‌టికీ హోం ఐసోలేషన్‌ లో ఉండి చికిత్స తీసుకునే వారి కోసం తాజాగా ఏపీ సర్కార్ మార్గదర్శకాలను విడుదల చేసింది. 
 
ఇంట్లో ఉన్నప్పుడు ఏ చిన్న ఇబ్బంది త‌లెత్తినా 0866 - 2410978 టోల్ ఫ్రీ నంబర్ కు కాల్ చేయాలని ప్రభుత్వం చెబుతోంది. శ్వాస‌ తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తినా, అత్యవసర పరిస్థితులు ఏర్పడినా టోల్‌ఫ్రీ నెంబర్​కు ఫోన్‌ చేసి మెడిక‌ల్ హెల్ప్ పొందాలని సూచనలు చేస్తోంది. బ్రౌన్‌రైస్‌, గోధుమలు, చిరుధాన్యాలు, తాజా పండ్లను ఆహారంలో ఎక్కువగా తీసుకోవాలని ప్రభుత్వం చెబుతోంది. 
 
గత కొన్ని రోజుల నుంచి తెలంగాణ నుంచి ఏపీకి వచ్చే వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటంతో అక్కడ లాక్ డౌన్ విధిస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. దీంతో గత నాలుగు రోజుల నుంచి హైదరాబాద్ నుంచి రాష్ట్రానికి వచ్చే వారి సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోంది. లక్షల సంఖ్యలో నగరం నుంచి రాష్ట్రానికి ప్రజలు వస్తున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. 
 
దీంతో ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. హోం ఐసోలేషన్ లో ఉండే వారి కోసం తాజాగా మార్గదర్శకాలను విడుదల చేసింది. మరోవైపు రాష్ట్రంలో ఇప్పటివరకు 16,097 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ కేసులలో రాష్ట్రానికి చెందిన కేసులు 13,625 కాగా మిగిలిన కేసులు ఇతర రాష్ట్రాలకు, విదేశాలకు చెందిన వారివని సమాచారం. రాష్ట్రంలో ప్రస్తుతం 8,586 యాక్టివ్ కేసులు ఉండగా 198 మంది వైరస్ భారీన పడి మృతి చెందారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: