కరోనా కాలంలో ఆర్థిక అవసరాలకోసం పీఎఫ్​ ఖాతా నుంచి నగదు ఉపసంహరించుకునేందుకు కేంద్రం వెసులుబాటు కల్పించింది. అయితే ఈ మొత్తం ఆదాయపన్ను పరిధిలోకి వస్తుందా? లేదా? అనే విషయాలు చూసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. మరి అదేలాగో ఇప్పుడే తెలుసుకోండి. కరోనాను కట్టడి చేసేందుకు మార్చి చివరి నుంచి ప్రభుత్వం లాక్‌డౌన్‌ అమలు చేసింది. ఆ సమయంలో డబ్బులేకపోవడం వల్ల చాలామంది ఉద్యోగ భవిష్య నిధి (ఈపీఎఫ్‌) నుంచి డబ్బులు ఉపసంహరించుకున్నారు. ఏప్రిల్‌ నుంచి 55లక్షలకు పైగా చందాదారులు రూ.15,000 కోట్లు వెనక్కి తీసుకున్నారు. అయితే, ఇది ఆదాయపన్ను పరిధిలోకి వస్తుందో రాదో చూసుకోవడం ముఖ్యమని ఆర్థికనిపుణులు సూచిస్తున్నారు.

 

 

ఆదాయపన్ను పరిధిలోకి మీరు ఉపసంహరించుకునే డబ్బులు వస్తే కొంత నష్టపోవాల్సి ఉంటుందన్నారు. ఐదేళ్ల సర్వీస్‌ తర్వాత ఉపసంహరిస్తే మాత్రం అసలు, వడ్డీకి పన్ను మినహాయింపు వర్తిస్తుందని అంటున్నారు. అంతకన్నా ముందే డబ్బులు తీసుకుంటే ఉద్యోగి, యజమాని చేసిన జమపై వడ్డీకి పన్ను కట్టాల్సి ఉంటుంది. ఉద్యోగి జమ చేసిన మొత్తానికి మాత్రం సెక్షన్‌ 80సీ ప్రకారం మినహాయింపు పొందవచ్చు. ఉద్యోగి ఆరోగ్యం బాగాలేక, అనివార్య కారణాల వల్ల యజమాని వ్యాపారం నిలిపివేసినా ఉపసంహరించే డబ్బుపై పన్ను ఉండదు. ఒకవేళ మీరు ఉద్యోగం మారితే కొత్త యజమానికి సంబంధించిన వివరాలతో ఖాతాను బదిలీ చేయించుకుంటే సర్వీస్‌ కొనసాగింపు లభించి పన్ను మినహాయింపునకు అర్హత పొందుతారు. ఉద్యోగం మారినప్పుడు యూనివర్సల్‌ అకౌంట్‌ నంబర్‌ (యూఏఎన్‌) ఉపయోగించుకుని ఖాతాను బదిలీ చేసుకోవాలి. పాత ఖాతా నుంచి కొత్తదానిలోకి డబ్బులు బదిలీ అవ్వగానే మినహాయింపు, ఉపసంహరణకు అర్హత పొందుతారు.

 

 

ఆదాయపన్ను పరిధిలోకి మీరు ఉపసంహరించుకునే డబ్బులు వస్తే కొంత నష్టపోవాల్సి ఉంటుందన్నారు. ఐదేళ్ల సర్వీస్‌ తర్వాత ఉపసంహరిస్తే మాత్రం అసలు, వడ్డీకి పన్ను మినహాయింపు వర్తిస్తుందని అంటున్నారు. అంతకన్నా ముందే డబ్బులు తీసుకుంటే ఉద్యోగి, యజమాని చేసిన జమపై వడ్డీకి పన్ను కట్టాల్సి ఉంటుంది. ఉద్యోగి జమ చేసిన మొత్తానికి మాత్రం సెక్షన్‌ 80సీ ప్రకారం మినహాయింపు పొందవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: