తెలంగాణాలో ఇప్పుడు సీఎం కేసీఆర్ కి కరోనా పెద్ద తల నొప్పిగా మారింది. బలమైన నేతగా ఆయన ఉన్నా సరే ఇప్పుడు కరోనా విషయంలో మాత్రం ఆయన నానా ఇబ్బందులు పడుతున్నారు. రోజు రోజుకి కరోనా కేసులు తీవ్ర కావడం హైదరాబాద్ లో కరోనా కేసులు అధికంగా ఉండటం ఆయనకు పెద్ద తల నొప్పిగా మారింది. సోషల్ మీడియాలో కూడా తెలంగాణ సర్కార్ తీరుని పలువురు తప్పుబడుతున్నారు. ఇక జాతీయ స‌గ‌టు కంటే కూడా తెలంగాణ‌లో క‌రోనా వ్యాప్తి చాలా ఎక్కువుగా ఉంది. 

 

ఇక కరోనా వ్యవహారంలో ఆయనను బిజెపి టార్గెట్ చేయడం సంచలనంగా మారింది. కరోనా  రోజు రోజుకి పెరగడంపై బిజెపి నేతలు ఆయన టార్గెట్ గా తీవ్ర విమర్శలే చేస్తున్నారు. ఆయన సీఎంగా పనికిరారు అంటూ విమర్శలు చేస్తున్నారు. తాజాగా బీజేపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి రామ్ మాధ‌వ్ సైతం కేసీఆర్ యేడాది పాల‌న‌లో స‌గం క‌ట్టిన కాళేశ్వ‌రం ప్రాజెక్టు మిన‌హా ఏం చేయ‌లేద‌ని విమ‌ర్శించారు. ఇప్పుడు కరోనా విషయంలో హైదరాబాద్ ని తమ ఆధీనం లోకి తీసుకోవడానికి కేంద్రం సిద్దమైంది అనే ప్రచారం సోషల్ మీడియాలో జరుగుతుంది. రాజకీయ పరిశీలకులు కూడా అదే అంటున్నారు. 

 

హైదరాబాద్ లో వైద్య సదుపాయాల విషయంలో విమర్శలు వస్తున్న నేపధ్యంలో ఇప్పుడు కేంద్రం రంగంలోకి దిగి అక్కడ వైద్య సదుపాయాలను రోజు వారీ కేసుల లెక్కలను బయటపెట్టే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. మరి దీనిపై భవిష్యత్తులో ఏ విధమైన పరిణామాలు చోటు చేసుకుంటాయి అనేది చూడాలి. ఏదేమైనా బీజేపీ కేసీఆర్‌ను క‌రోనాను బూచీగా పెట్టుకుని గ‌ట్టిగానే టార్గెట్ చేస్తున్న‌ట్టే క‌నిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: