ఏపీ సీఎం వైఎస్ జగన్ ఔట్ సోర్సింగ్ సర్వీసుల కార్పొరేషన్ ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా 50,449 మందికి ఉద్యోగ నియామక పత్రాలు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల్లో 50 శాతం మహిళలకు రిజర్వేషన్ కల్పిస్తూ జగన్ సర్కార్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు మిగతా 50 శాతం ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు కేటాయిస్తున్నట్లు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ మాట్లాడుతూ గతంలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగస్తులు జీతాలు తీసుకోవడానికి లంచాలు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. నా పాదయాత్రలో ఎంతో మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు నా వద్దకు వచ్చి వారి బాధలను పంచుకున్నారు. ఇస్తామన్న జీతాలు ఇవ్వకుండా కోతలు విధించారని విలపించారు.

 

ఉద్యోగాలు రావడానికి, జీతాలు ఇవ్వడానికీ లంచాలు తీసుకున్న గత ప్రభుత్వం ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను నిలువునా దోచుకుంది. ఈ పరిస్థితిని రూపుమాపడానికే ఏపీ ఔట్ సోర్సింగ్ సర్వీసెస్ కార్పొరేషన్ ను ఏర్పాటు చేసినట్టు జగన్ క్లారిటీ ఇచ్చారు. మహిళలకూ 50% ఉద్యోగాలు దక్కేలా దీనిని అమలు చేస్తాం. ప్రస్తుతానికి 50,449 మందికి నియామక పత్రాలు ఇస్తున్నాం. ఈ సంఖ్యను వచ్చే రోజుల్లో పెంచుతాం. గత ప్రభుత్వంలో కాంట్రాక్ట్‌లో 20 మంది పనిచేయాలని ఉంటే 15 మందితో పనిచేయించి.. మిగిలిన వారి జీతాలను కాంట్రాక్టర్లే తీసుకునేవారు.

 

ఇకపై సిఫారసులు, దళారీలకు చోటు లేదు. ఉద్యోగులకు పూర్తి భద్రతను ఇస్తాం అని జగన్ పేర్కొన్నారు. గవర్నమెంటు ఉద్యోగస్తులకు ఏ విధంగా జీతాలు ఇవ్వడం జరుగుతుందో అదే రీతిలో జీతాలు  ఔట్ సోర్సింగ్ ఉద్యోగస్తులకు వచ్చేలా రాబోయే రోజుల్లో నిర్ణయాలు తీసుకుంటామని జగన్ క్లారిటీ ఇచ్చారు. కానీ ఉద్యోగ భద్రత విషయంలో పని చేసే విధానం బట్టి ఉంటుందని, మీరు జీతాలు తీసుకోవడానికి నేను ఉన్నంతకాలం ఎవరికీ లంచాలు ఇవ్వాల్సిన పరిస్థితి ఉండదని జగన్  ఔట్ సోర్సింగ్ ఉద్యోగస్తులకు భరోసా ఇచ్చారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: