చైనా మరియు  భారత్ సరిహద్దు ప్రాంతంలో ప్రస్తుతం యుద్ధ వాతావరణం పరిస్థితి ఉండటంతో  సైనికులకు ఎప్పటికప్పుడు  ఆదేశాలు ఇస్తున్న కేంద్ర ప్రభుత్వం  వాళ్ళను అలర్ట్ చేస్తూనే ఉంది.  ఎలాంటి పరిస్థితి వచ్చినా ఎదుర్కొనే విధంగా పూర్తి స్వేచ్ఛ సైనికులకు  ఇవ్వటంతో  చైనా ఆర్మీ  ఎలాంటి చర్యలకు పాల్పడిన వాటిని ధీటుగా ఎదుర్కోవడానికి భారత సైన్యం సరైన వ్యూహాలను సిద్ధం చేసుకుని ఉంది. ఇదిలా ఉండగా భారత్ ప్రధాని మోడీ ఇండియా చైనా సరిహద్దు ప్రాంతం లడ్డాక్ ప్రాంతంలో ఆకస్మికంగా వెళ్లి పలువురు ఉన్నత అధికారులతో సమావేశం అవ్వడం జరిగింది. మోడీ రాకతో రక్షణదళాల చీఫ్ బిపిన్ రావత్ తో కలిసి లేహ్ చేరుకున్నారు.

 

చైనా, భారత్ ల మధ్య ఉద్రికత్తలు ఏర్పడిన నేపద్యంలో ఈ పర్యటనకు ప్రాదాన్యత సంతరించుకుంది. సైనికాధికారులతో మోదీ సమీక్ష జరిపి ,టాప్‌ కమాండర్లతోనూ సమావేశం అయ్యారు. గాల్వాన్ ఘటనలో గాయపడ్డ సైనికులను సైతం మోదీ పరామర్శించరు. సైనికులకు భరోసా ఇవ్వడం, చైనాకు గట్టి సందేశం ఇవ్వడంలో భాగంగానే ప్రధాని పర్యటించినట్లు భావిస్తున్నారు.సైనికులలో నూతనోత్సాహం నింపటం కోసం ఏకంగా మోడీ ఈ పర్యటనలో 11 వేల అడుగుల ఎత్తులో సైనికులను కలవడం జరిగింది. నీమ్ లో ఉన్నత అధికారులతో సమావేశం అవ్వడం జరిగింది.

 

ఈ సందర్భంగా యుద్ధ సన్నద్ధత, సరిహద్దులలో పరిస్థితిపై ఆరా తీయడం జరిగింది. కాగా మోడీ పర్యటన చివరి నిమిషం రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కి కూడా తెలియకుండా వెళ్ళటం బట్టి చైనాతో ఈ పర్యటన తో ఢీ అంటే ఢీ అన్నట్టుగా యుద్ద సన్నివేశం మోడీ పంపినట్లు ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఏది ఏమైనా సైనికుల దగ్గరకు అన్ని వేల అడుగుల ఎత్తులో ప్రధాని రావటంతో సైనికులలో నూతనోత్సాహం నిండింది అని ఈ పర్యటన తర్వాత రాజనాథ్ సింగ్ సోషల్ మీడియాలో తెలపడం జరిగింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: