కరోనా వైరస్ ప్రభావం అన్ని రంగాలతో పాటు ప్రవేట్ పాఠశాల టీచర్లపై కూడా పడింది. అంతంతమాత్రంగా జీవితాలతో బతుకుబండిని లాక్కొని వెళ్తున్న ప్రవేట్ టీచర్లకు ఈ లాక్ డౌన్ కరోనా ఎఫెక్ట్ గుదిబండగా మారింది. మరో పని చేయలేక సంసారాన్ని ఈదలేక జీవితం మీద విరక్తి తో భవిష్యత్తు మీద ఆశ లేకుండా బతుకుతున్నారు. నాలుగు నెలలుగా జీతాలు లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కరోనా వైరస్ లాక్ డౌన్ కారణంగా పాఠశాలలు మూతపడటంతో జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు అంటూ యాజమాన్యాలు చేతులెత్తేశాయి. పైగా పిల్లల ఫీజులు కట్టకుండా ఉంటే ఎక్కడ నుంచి జీతాలు తీసుకురావాలని ఎదురు ప్రశ్నలు వేస్తున్నారట. దీంతో చాలామంది ప్రైవేట్ స్కూల్ టీచర్లు ప్రత్యామ్నాయ మార్గాన్ని వెతుక్కుంటున్నారు.

 

మరోపక్క పాఠాలు చెప్పే జీవితానికి అలవాటు పడటంతో వేరే పని చేయటానికి ఆత్మ అభిమానాన్ని చంపుకోలేక అనేక ఇబ్బందులు ప్రవేటు పాఠశాలల టీచర్లు ఎదుర్కొంటున్నారు. ఎంతో ఉన్నత స్థాయి చదువులు చదివి పిల్లలకు చదువు అందిస్తున్న ప్రైవేట్ టీచర్ల పరిస్థితి చాలా దారుణంగా ఉందని కరోనా కాలంలో జీతాలు లేక ఇబ్బందులు, బాధలు పడుతున్నవారిలో ప్రైవేట్ టీచర్ల పరిస్థితి వర్ణాతీతంగా ఉందని వార్తలు గట్టిగా వస్తున్నాయి. ప్రభుత్వం గానీ మరియు పాఠశాలల యాజమాన్యాలు గాని గుర్తించలేకపోవడం తో అనేక ఇబ్బందులు ప్రైవేట్ టీచర్స్ ఎదుర్కొంటున్నారు.

 

ఇదిలా ఉంటే ఉద్యోగం పోకుండా నిలబడాలి అంటే కచ్చితంగా ప్రతి టీచర్ కొంతమంది స్టూడెంట్స్ ని స్కూల్లో జాయిన్ చేయాలని యాజమాన్యం ఒత్తిడి తీసుకు వస్తున్నాయట. అంతేకాకుండా ఆన్లైన్-లో నిర్వహించే క్లాసులకు ఫీజుల వసూళ్ల విషయంలో భారం మొత్తం టీచర్ల పైన యాజమాన్యాలు పెడుతున్నాయట. దీంతో ఏం చేయలేని పరిస్థితుల్లో ప్రైవేటు టీచర్లు లబోదిబోమంటున్నారు. ప్రభుత్వాలే మమ్మల్ని ఆదుకోవాలని సూచిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: