ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూరులో దారుణం జరిగింది. కరుడుగట్టిన నేరస్థుడు వికాస్ దూబే ముఠా జరిపిన కాల్పుల్లో డీఎస్పీ దేవేంద్ర మిశ్రా సహా 8 మంది పోలీసులు ప్రాణాలు కోల్పోయారు.  పక్కా సమాచారంతో వికాశ్ దూబే గ్యాంగ్‌ను పట్టుకునేందుకు నిన్న రాత్రి 16 మంది పోలీసుల బృందం వెళ్లింది. కానీ అనుకోకుండా ఆ గ్యాంగ్ స్టర్ కాల్పులు జరిపారు..  ఈ ఘటనలో డీఎస్పీ దేవేంద్ర మిశ్రాతోపాటు ముగ్గురు సబ్ ఇన్‌స్పెక్టర్లు, నలుగురు కానిస్టేబుళ్లు అక్కడికక్కడే మృతి చెందారు. వికాశ్ ముఠా జరిపిన కాల్పుల్లో గాయపడిన మరో నలుగురు పోలీసులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న వెంటనే ఎస్పీ, ఐజీ, ఫోరెన్సిక్ బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి.  ఆ గ్యాంగ్ కోసం తీవ్రంగా గాలింపులు చేపట్టారు. ఎన్‌కౌంటర్ నుంచి వికాస్ దూబే తప్పించుకుని అడవుల్లోకి పారిపోయాడు. చౌబేపూర్ పరిధిలోని బిథూర్ దిక్రూ గ్రామంలోని ఇంట్లో వికాస్ దూబే తలదాచుకున్నట్లు సమాచారం అందడంతో 16 మంది పోలీసులు నిన్న అర్ధరాత్రి దాటాక  అక్కడికి చేరుకున్నారు.

IHG

ఇక తమ సహచరులను 8 మందిని చంపిన నేరస్తులపై విరుచుకుడ్డారు. గ్యాంగ్‌స్టర్ వికాస్ దూబే తప్పించుకోగా అతని అనుచరులు ముగ్గురు హతమయ్యారు. నిన్న అర్ధరాత్రి తర్వాత కాన్పూర్‌లో రౌడీ షీటర్లు జరిపిన కాల్పుల్లో 8 మంది పోలీసులు చనిపోగా, ఏడుగురు గాయపడ్డ విషయం తెలిసిందే. ఈ కేసు విషయాన్ని ఛాలెంజ్ గా తీసుకున్నారు పోలీసులు.  పోలీసుల మృతికి స్పందించిన యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సంతాపం తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లోనేరస్తులను వదిలే ప్రసక్తి లేదని ఆయన అన్నారు. 

IHG

ఈ క్రమంలోనే చుట్టుపక్కల గ్రామాలను జల్లెపడుతుండగా కొందరు నిందితులు తారసపడ్డంతో ఎన్‌కౌంటర్ జరిగింది. దూబే ముఠాను పట్టుకుని కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీ హెచ్‌సీ అవస్థిని ఆదేశించారు.  కాగా,  వికాస్ దూబేపై 60 కేసులు ఉన్నాయి. హత్యలు, కిడ్నాపులు, బెదిరింపులుపై వీటిని నమోదు చేశారు. అతడు తనను చంపుతానని బెదిరిస్తున్నాడంటూ రాహుల్ తివారీ అనే వ్యక్తి పోలీసులు ఫిర్యాదు చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: