దేశం అంతా ఇప్పుడు కరోనా వైరస్ కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది. కరోనా వైరస్ వచ్చిన వాళ్లకు ప్రభుత్వం క్వారంటైన్ లో ఉంచి బాగానే చూసుకుంటున్నా.. అక్కడక్కడ మాత్రం నిర్లక్ష్యం కనిపిస్తూనే ఉంది. ఇక ప్రైవేట్ ఆసుపత్రుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఇక్కడ వేసే బిల్లులు సామాన్యులు తమకు ఉన్నదంతా ఊడ్చి ఇచ్చినా సరిపోదు అంటారు. ఇక పేదోడికి వచ్చిందంటే ఆ నరకం గురించి చెప్పాల్సిన పనిలేదు. కనీసం కనికరం కూడా లేకుండా డబ్బుకోసం పీడిస్తారు. రకరకాల టెస్టుల పేరుతో జేబులు ఖాళీ చేయడం అందరికి తెలిసిందే.  తాజాగా ఆస్పత్రి బిల్లు కట్టలేదని రోగిని కొట్టి చంపారు ఆస్పత్రి సిబ్బంది.

 

యూపీలో అయితే ఓ ప్రైవేటు ఆస్పత్రి నిర్వాహకులు దారుణానికి ఒడిగట్టారు. రూ. 4 వేల బిల్లు కోసం రోగిని కొట్టి చంపారు. ఆస్పత్రి బిల్లు ఎంత అవుతుందని రోగితోపాటు వెళ్లిన బంధువు చమన్ ఆస్పత్రి సిబ్బందిని అడిగాడు. అందుకు వారు అల్ట్రా సౌండ్ స్కానింగ్ తీసిన తర్వాత చికిత్సకు ఎంత ఖర్చవుతుందో చెబుతామన్నారు. అయితే, అల్ట్రా సౌండ్ స్కానింగ్ తీయకుండానే ముందుగా మందుల కోసం రూ.5000 బిల్లు వేశారు. అందుకు వాళ్లు డబ్బులు చెల్లించారు. అనంతరం మళ్లీ ఆస్పత్రిలో ఒకరోజు ఉన్నందుకు రూమ్ అద్దె రూ.4000 నుంచిరూ.5000 అవుతుందని చెప్పారు. ఆ త ర్వాత పరీక్షల కోసం ఉన్నంత సేపు రూ.

 

 4 వేల బెడ్ చార్జీ చెల్లించాలని సూచించారు. అయితే తమకు ముందుగా అంత డబ్బు అవుతుందని చెప్పలేదని పేషెంట్ సహా అతని బంధువులు గొడవకు దిగారు. తాము ఆ డబ్బు చెల్లించలేమని బయటకు వెళ్లిపోయారు. వెంటనే ఆస్పత్రి యాజమాన్యం రోగి బంధువు చమన్‌‌తో గొడవకు దిగారు. మాటా మాటా పెరగడంతో రోగి సుల్తాన్‌పై ఆస్పత్రి  సిబ్బంది దాడిచేశారు. తీవ్ర గాయాలతో అతడు అక్కడికక్కడే మరణించాడు. ఈ గొడవ అంతా  సీసీ కెమెరాల్లో రికార్డు అయింది. రోగి బంధువుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: