జనసేనాని పవన్ కళ్యాణ్. రాజకీయంగా ఒక పార్టీ నాయకునిగా కొనసాగుతున్నారు. అదే సమయంలో సినిమాల్లో కూడా నటిస్తూ తన కత్తికి రెండు వైపులా పదును ఉందని చాటుకుంటున్నారు. 2014 నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లో ఉంటూ వస్తున్న పవన్ జగన్ విషయంలో ఎపుడూ మెచ్చుకోలుగా మాట్లాడింది లేదు. అదే సమయంలో ఆయన చంద్రబాబుని పెద్దగా విమర్శించరని పేరు తెచ్చుకున్నారు. అయితే ఇపుడు పవన్ బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. అటు వైసీపీ, ఇటు టీడీపీలకు దూరం అంటున్నారు.

 

ఇక పవన్ హఠాత్తుగా జగన్ సర్కాని పొగుడుతూ ఏకంగా జగన్ కే షాక్ ఇచ్చేశారు. ఈ నెల 1న విజయవాడ బెంజి సర్కిల్లో ఒకేసారి 1088 అంబులెన్సులను  రోడ్ల మీదకు తెస్తూ వాటిని జగన్ ప్రారంభించిన తీరు జాతీయ స్థాయిలో జగన్ కి ఎంత పేరు తెచ్చింది అన్నది అందరికీ తెలిసిందే. జాతీయ మీడియా సైతం జగన్ని మెచ్చుకుంది.

 

ఇక టాలీవుడ్ ప్రముఖులు సహా అంతా జగన్ని ప్రశంసలతో ముంచెత్తారు. ఇక ఏపీలోని అన్ని  రాజకీయ పార్టీలు మాత్రం యధావిధిగా విమర్శలు చేశాయి. నిజాయతీగా రాజకీయాలు చేస్తాయనుకున్న వామ‌పక్షాలు సైతం జగన్ విషయంలో ఎందుకో మంచి జరిగితే మంచి అని గట్టిగాబయటకు  చెప్పలేకపోతున్నాయి.

 

ఇక టీడీపీ సంగతి సరేసరి. జగన్ ఏం చేసినా వారిని అసలు నచ్చదు. లేనిపోని విమర్శలు చేస్తూ బురద జల్లుడే పనిగా పెట్టుకుంటారు తమ్ముళ్ళు,  ఇంతటి స్థితిలో కూడా జనసేన తరఫున పవన్ కళ్యాణ్ జగన్ని మెచ్చుకుంటూ ప్రశంసల జల్లు కురిపించడం అంటే మాటలు కాదు.

 

ఎందుకంటే పవన్ ఎపుడూ జగన్ మంచిని మెచ్చలేదు. తప్పులు జరిగితే మాత్రం గట్టిగానే తగులుకునేవారు. అటువంటి పవన్ ఇన్నాళ్ళకు ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడి తాను అసలైన ప్రజా నాయకుడిని అనిపించుకున్నారు. కరోనా వంటి కష్టాల వేళ ఏకంగా 1088 వాహనాలకు జగన్ ప్రారంభించి గ్రామలకు పంపడం అంటే సామాన్య విషయం కాదని పవన్ అన్నారు. అదే విధంగా గత మూడు నెలలుగా కరోనా విషయంలో జగన్ సర్కార్ నిబద్ధతో వ్యవహరిస్తోందని కూడా కితాబు ఇచ్చారు. కరోనా పరీక్షల్లో చాలా బాగా చేస్తున్నారని పవన్ అనడం అంటే నిజంగా జగన్ ఆయన మనసు గెలుచుకున్నారని చెప్పాలి.

ఇలా పవన్ ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడి జగన్ని మెచ్చుకోవడం ద్వారా ఓక్ వైపు జగన్ కే కాదు, మరో వైపు చంద్రబాబుకు కూడా షాక్ ఇచ్చేశారు, ఇప్పటిదాకా ఒక్క విషయంలో కూడా చంద్రబాబు జగన్ని మెచ్చుకోలేదు సరికదా విపక్షాలు కూడా అన్నీ అలాగే ఉండాలని కోరుకున్నారు. మరి పవన్ వంటి చరిష్మాటిక్ లీడర్ జగన్ని పొగిడి బాబుకు షాక్ ఇచ్చేశారనే చెప్పాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: