కర్ణాటక రాష్ట్రంలో కరోనా ప్రకంపనలు సృష్టిస్తోంది. తాజాగా కర్ణాటక రాష్ట్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ గడచిన 24 గంటల్లో నమోదైన కరోనా కేసు వివరాలను హెల్త్ బులిటెన్ ద్వారా మీడియాకు విడుదల చేసింది. ఇందులో గడచిన 24 గంటల్లో ఏకంగా 1694 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 19710 కు చేరుకున్నాయి. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 8805 కేసులు యాక్టివ్ గా కొనసాగుతున్నాయి. ఇందులో 201 మందికి సీరియస్ గా ఉండడంతో వారిని ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు.

 

 

 

ఇక మరోవైపు నేడు ఒక్కరోజే 471 మంది రాష్ట్రవ్యాప్తంగా కరోనా వైరస్ నుంచి కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో హాస్పిటల్ నుండి డిస్చార్జ్ అయ్యారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 10608 మంది కరోనా నుండి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా నేడు ఒక్క రోజే కరోనా బారిన పడి 21 మంది మృత్యువాత పడ్డారు. దీంతో రాష్ట్రంలో మృతుల సంఖ్య 293 కు చేరుకుంది. గత వారం రోజుల నుండి కర్ణాటక రాష్ట్రంలో రోజుకు వెయ్యి పైగా కేసులు నమోదు అవడంతో కర్ణాటక రాష్ట్రంలో కేసులు తీవ్రరూపం దాలుస్తున్నాయి. మరీ ముఖ్యంగా బెంగళూరు నగరంలో కరోనా వైరస్ బీకర రూపం దాల్చింది. మహా నగరంలో రోజుకి 700 కేసులు నమోదవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: