నర్సాపురం ఎంపీగా గెలవాలని ఆయన 2014 నుంచి ట్రై చేస్తూనే ఉన్నార్. అయితే అయిదేళ్ల తరువాత నాలుగు పార్టీలు మారిన తరువాత చివరికి నెరవేరింది.  అది కూడా మొదట చేరిన పార్టీలోనే మళ్ళీ చేరి రఘురాంక్రిష్ణం రాజు మొత్తానికి ఎంపీ అయ్యారు.  ఆయన ఎంపీ అయిన తరువాత నుంచి ఎందుకో కానీ వైసీపీ అధినాయకత్వానికి బాగా  ఆయనకు చెడింది. బీజేపీతో ఆయన చనువుగా ఉంటున్నారని వైసీపీ నేతల అనుమానం.

 

ఇక రాజుగారు మొదట్లో ఎలా ఉన్నా ప్రధాని మోడీ రాజు గారూ బాగున్నారా అని పార్లమెంట్ సెంట్రల్ హాలులో  పలకరించేసరికి ఎక్కడ లేనీ ఉత్సాహం తెచ్చుకున్నారని, ఆ ఊపులో సొంత పార్టీని కాదని కొన్ని అడుగులు వేశారని అంటారు నిజానికి రఘురామక్రిష్ణం రాజు కూడా ఇంత తొందరగా పార్టీ నుంచి అనర్హత  పిటిషన్ పడుతుందని అనుకోలేదని చెబుతారు.

 

ఇక తన వెనక బీజేపీ ఉందని రాజుగారు ఇచ్చిన బిల్డపులు ఇపుడు చివరికి ఆయనకే ఎసరుగా మారుతున్నాయా అన్న చర్చ కూడా వస్తోంది. తన మీద అనర్హత  వేటు వేయవద్దంటూ ఆయన చివరికి హై కోర్టుని ఆశ్రయించారంటే ఇక రాజకీయం ముగిసి న్యాయ స్థానాల వైపు చూపు పడిందనుకోవాలి. న్యాయ దేవతే కాపాడాలని రాజు గారు కోరడం వెనక వ్యూహం ఎలా ఉన్నా ఆయన రాజకీయ బేలతనం మాత్రం బయటపడిందని అంటున్నారు.

 

ఇక వైసీపీకి ఢిల్లీలో పలుకుబడి ఎలాంటిదో కూడా ఈ దెబ్బకు తెలుస్తుంది  అని కూడా అంటున్నారు. రాజు గారి మీద వేటు వేస్తామని స్పీకర్ ఓం బిర్లా హామీ ఇచ్చారని వైసీపీపీ నేత విజయసాయిరెడ్డి చెప్పారు. ఇక మిగిలిన ఎంపీలు కూడా ఉప ఎన్నికకు సిధ్ధంగా ఉండండి రాజు గారూ అంటూ హెచ్చరించారు. మరి సీన్ అంతా చూస్తూంటే రాజు గారి కధ కంచికి చేరుతుందా లేక ఆయన్ని ఈ ఆపత్కాలంలో ఆదుకునే అద్రుశ్య హస్తం ఏదైనా ఉందా అన్నది చూడాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: