రాజకీయాల్లో చేరిన వారికి పరమపద సోఫానం పదవులే. పదవి లేకపోతే ఎవరూ ఉండలేరు. ఎందుకంటే పదవి కోసమే ఈనాటి రాజకీయాలు కాబట్టి. అది పూర్వం నుంచి ఉన్నా కూడా ఇప్పటికాలంలో మరింతగా అది ముదిరింది. అందువల్ల ఎమ్మెల్యేగా నెగ్గిన ప్రతీ వారూ మంత్రి పదవి కోరుకుంటారు. ఆ పెద్ద కుర్చీలో కొన్నాళ్ళు అయినా కూర్చోవాలని బలంగా ఆశిస్తారు.

 

ఇక ఏపీలో మంత్రివర్గం విస్తరిస్తారని అంటున్నారు. దాంతో ఇపుడు మళ్లీ అందరి చూపూ మంత్రి కుర్చీల మీద పడింది. ఈ నెల 22 నుంచి శ్రావణ మాసం మంచి రోజులు కావడంతో మంత్రి వర్గ విస్తరణ ఉంటుందని కూడా అనుకుంటున్నారు. దానికి తోడు ప్రతీ వారు తమ దరఖాస్తు చూడమని కూడా కోరుకుంటున్నారు.

 

ఇక జగన్ ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్ ఇస్తున్నారు. వారంతా అన్ని విషయాలూ మాట్లాడి చివర్లో మాత్రం మా సంగతి చూడండి మీ చల్లని చూపు ఉంటే మాకు అదే పదివేలు అంటూ అర్ధమయ్యే భాషలోనే తమ మంత్రి పదవి కోరికను చెప్పుకుంటున్నారుట. దీంతో జగన్ కూడా వారి ఆశలను కళ్లలో చూస్తున్నారుట.

 

సరే వైసీపీ తరఫున 150 మంది దాకా ఎమ్మెల్యేలు ఉన్నారు. అందరికీ జగన్ పదవులు ఇవ్వలేరు కదా. ఎంత కాదనుకున్న పాతిక మందికి మించి ఇచ్చే చాన్సే లేదు. ఇక ఇపుడు రెండు ఖాళీలు ఉన్నాయి. దాంతో పాటుగా మరికొందరిని ఇంటికి పంపించి కొత్తవారికి చాన్స్ ఇస్తార‌ని అంటున్నారు. అలా జరిగితే చాలా మందికి ఆశలు తీరుతాయి.

 

ఇక జబర్దస్తు గా రాజకీయాల్లో రాణిస్తున్న ఆర్కే రోజాకు ఈసారి మంత్రి పదవి ఖాయమని అంటున్నారు. ఆమె లాంటి మనిషి సర్కార్ లో  ఉండాలని కూడా గట్టిగా కోరుకుంటున్నారుట. జగన్ సైతం తనతో మొదటి నుంచి అడుగులు వేసిన రోజాకు ఈ దఫా మంత్రి అవకాశం ఇవ్వాలని ఆలోచిస్తున్నట్లుగా చెబుతున్నారుట. మొత్తం మీద చూసుకుంటే ఈసారి మంత్రివర్గ విస్తరణలో హైలెట్, సెంటర్ ఆఫ్ ది సీన్ గా రోజా ఉంటారని అంటున్నారు. ఏదైనా మార్పులేకపోతే మాత్రం రోజమ్మ మినిస్టర్ కావడం ఖాయమని అంటున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: