ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ లో నిన్న అర్ధరాత్రి దాటాక  జరిగిన ఎన్కౌంటర్ లో 8మంది పోలీసులు మృతి చెందగా మరో 7గురు గాయపడ్డారు. కరుడు గట్టిన నేరస్థుడు వికాస్ దూబే ను పట్టుకునే క్రమంలో అతను వున్న ఇంట్లో రైడ్ చేయడానికి వెళ్లిన పోలీసుల పై వికాస్ దూబే అనుచరులు(క్రిమినల్స్) విచక్షణా రహితంగా కాల్పులు జరుపడంతో డిప్యూటీ ఎస్పీ దేవేంద్ర మిశ్రా సహా ముగ్గురు ఎస్సైలు ,నలుగురు కానిస్టేబుళ్లు అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. ఈ దాడిలో ఇద్దరు క్రిమినల్స్ కూడా హతమయ్యారు కాగా వికాస్ దూబే పై 60 క్రిమినల్ కేసులు ఉన్నట్లు సమాచారం. 
 
ఇక ఈ ఎన్కౌంటర్ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్. పోలీసులపై కాల్పులు జరిపిన క్రిమినల్స్ పై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీస్ శాఖను ఆదేశించారు అలాగే ఈఎన్కౌంటర్ లో మరణించిన పోలీసుల కుటుంబాలను సీఎం పరామర్శించారు. బాధిత కుటుంబానికి కోటి రూపాయల ఆర్థిక సాయంతో పాటు పెన్షన్ ,ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని యోగి ఆదిత్యనాథ్ వెల్లడించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: