తూర్పుగోదావరి జిల్లా తుని లో మాజీ మంత్రి టిడిపి నాయకుడు కొల్లు రవీంద్ర ను పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. ఇటీవల కృష్ణా జిల్లా మచిలీపట్నంలో మంత్రి పేర్ని నాని అనుచరుడు వైకాపా పార్టీ నాయకుడు మోకా భాస్కరరావు హత్య విషయంలో ఈయనపై అభియోగాలు ఉన్నాయి. కొల్లు రవీంద్ర ప్రోద్బలంతోనే భాస్కరరావు ను హత్య చేసినట్లు నిందితులు పోలీసులకు వాంగ్మూలం ఇవ్వటం జరిగింది. దీంతో ఆయన్ను పోలీసులు ఇటీవల తూర్పుగోదావరి జిల్లా తుని దగ్గర అదుపులోకి తీసుకొని విజయవాడకు తరలిస్తున్నారు. ఇక భాస్కర్ రావు హత్య కేసులో ఇప్పటికే ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేయటం జరిగింది. కొల్లు రవీంద్ర పై 302,109 సెక్షన్ల కింద కేసు నమోదు కావడం జరిగింది. పక్కా స్కేచ్ తో విశాఖపట్టణం పారిపోవాలని భావించిన కొల్లు రవీంద్ర పోలీసులు పట్టుకోవడం జరిగింది.

 

సరిగ్గా కొల్లు రవీంద్ర అరెస్టుకు గంటన్నర ముందు మచిలీపట్నం డిఎస్పీ మహబూబ్ బాషా మీడియాతో మాట్లాడటం జరిగింది.  మీడియాతో మహబూబ్ బాషా మాట్లాడుతూ…”టీడీపీ మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ప్రోద్బలంతోనే భాస్కరరావును నిందితులు హత్య చేసినట్లు వాంగ్మూలంలో తెలపడం జరిగింది. ఈ కేసులో ఇప్పటికే ఐదుగురిని అరెస్టు చేయటం జరిగింది. ఈ తరుణంలో ముందుగా నోటీసు ఇచ్చేందుకు కొల్లు ఇంటికి వెళ్లిన పోలీసులు ఆయన లేకపోవడంతో వెనుతిరిగారు. చివరాకరికి మూడు బృందాలుగా పోలీసులు గాలించి పరారీలో ఉన్న కొల్లు రవీంద్ర ని తుని వద్ద అరెస్టు చేసినట్లు మచిలీపట్నం డీఎస్పీ మహబూబ్ బాషా చెప్పుకొచ్చారు.

 

కొల్లు రవీంద్ర అరెస్టుతో తెలుగుదేశం పార్టీలో కీలక నాయకులు అధికార పార్టీపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. లేనిపోని కేసులలో బీసీ నాయకులను టార్గెట్ చేసి తప్పుడు కేసులు బనాయిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం ఈ వార్త ఏపీ మీడియా సర్కిల్ లో మరియు రాజకీయాలలో సంచలన వార్తగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: