తెలంగాణలో కరోనా హవా కొనసాగుతుంది. హైదరాబాద్ తోపాటు మిగితా జిల్లాలు కూడా కరోనా దెబ్బకు వణికిపోతున్నాయి.అందులో భాగంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో నిన్న ఒక్క రోజే  42 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో ఒక కేసు మాత్రమే వరంగల్ అర్బన్ లో నమోదు కాగా 41కేసులు రూరల్ లో నమోదు కావడం గమనార్హం. కేసుల సంఖ్య పెరుగుతుండడంతో నగర వాసుల్లో ఆందోళన నెలకొంది. 
 
ఇక నిన్న ఒక్కరోజే రాష్ట్ర వ్యాప్తంగా రికార్డు స్థాయిలో 1892 పాజిటివ్ కేసులు వచ్చినట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది అందులో అత్యధికంగా జిహెచ్ఎంసి లో1658 కేసులు బయటపడ్డాయి. నిన్నమొత్తం 5965 శాంపిల్ టెస్టులు జరిగాయి. ఇప్పటివరకు తెలంగాణలో మొత్తం 20462 కరోనా కేసులు నమోదవ్వగా అందులో 10195 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం 9984కేసులు యాక్టీవ్ గా వున్నాయి. ఈరోజు కరోనా తో 8మంది మరణించడంతో రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 283కి చేరింది.  
మరో వైపు దేశ వ్యాప్తంగా నిన్న దాదాపు అన్ని రాష్ట్రాల్లో  భారీగా కరోనా కేసులు నమోదయ్యాయి అందులో ఒక్క మహారాష్ట్రలోనే 6364 కేసులు నమోదుకాగా తమిళనాడులో 4329, ఢిల్లీలో 2520 కేసులు బయటపడ్డాయి. నిన్న ఒక్క రోజే 23000కు పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని సమాచారం. ఇక ఇప్పటివరకు ఇండియాలో 640000కరోనా కేసులు నమోదుకాగా 18500కరోనా మరణాలు సంభవించాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: