2014 మార్చి నెలలో సరిగ్గా ఎన్నికల ముందు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీని స్థాపించడం జరిగింది. అప్పటి నుండి ఒకటే టార్గెట్ వైయస్ జగన్. ఆ సమయంలో జరిగిన ఎన్నికలలో చంద్రబాబు బీజేపీ కూటమితో చేతులు కలిపి జగన్ ని టార్గెట్ చేసుకొని పవన్ కళ్యాణ్ భారీ స్థాయిలో డైలాగులు వేయటం జరిగింది. దాంతో పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే టీడీపీకి మద్దతు ఇవ్వడం జరిగిందో 2014 ఎన్నికల్లో వైసీపీ వైపు ఉన్న గాలి ఒక్కసారిగా టీడీపీ వైపు మళ్ళింది. రెండు గోదావరి జిల్లాల్లో ఓట్లు మొత్తం సైకిల్ కి పడ్డాయి. దెబ్బకు చంద్రబాబు ముఖ్యమంత్రి అవడం జరిగింది. అయితే ఆ తరుణంలో ఎన్నికల సమయంలో ప్రశ్నిస్తాను అని చెప్పి, ఆఖరికి చంద్రబాబు ముఖ్యమంత్రి అయినా తప్పు చేస్తే ప్రశ్నిస్తాను అని 2014 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ప్రజలకు మాట ఇవ్వడం జరిగింది.

 

సీన్ కట్ చేస్తే చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక పవన్ కళ్యాణ్ యధావిధిగా సినిమాలు చేసుకోవడం జరిగింది.  సరిగ్గా ఎన్నికలకు సంవత్సరం ఉందనగా మళ్లీ పవన్ కళ్యాణ్ 2018లో జనసేన తరపున యాక్టివ్ పాలిటిక్స్ చేయడం జరిగింది అప్పటికే రాష్ట్రంలో టీడీపీ పై అనేక అవినీతి ఆరోపణలు అదేవిధంగా ఇచ్చిన హామీల విషయంలో చంద్రబాబు ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా వ్యవహరించడంతో పవన్ కళ్యాణ్... టీడీపీ -బీజేపీ కూటమి నుండి బయటికి రావడం జరిగింది. ఒంటరిగా పోటీ చేసిన గాని చాలా వరకు టీడీపీ  తో  అంతర్లీనంగా పొత్తు ఉన్నట్టుగా అభ్యర్థులను పవన్ కళ్యాణ్ నిలబెట్టినట్టు వార్తలు రావడంతో పరిస్థితులు కూడా అలాగే ఉండటంతో అప్పట్లో గత ఎన్నికలలో ప్రజలు బలంగా నమ్మటం జరిగింది. ఇదే తరుణంలో ప్రతిపక్షంలో ఉన్న జగన్ కూడా పవన్ కళ్యాణ్ పేరు ప్రస్తావించకుండా చంద్రబాబు పార్ట్నర్ అంటూ బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లారు.

 

సీన్ కట్ చేస్తే 2019 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ మొట్టమొదటి సారి పోటీ చేసిన రెండు చోట్లా ప్రజలు ఓడిపోవడం జరిగింది. చంద్రబాబు పార్టీ కూడా చిత్తు చిత్తుగా ఓడిపోవడం జరిగింది. భారీ స్థాయిలో జగన్ అధికారంలోకి రావడం మనకందరికీ తెలిసిందే. ఇదంతా పక్కన పెడితే జగన్ అధికారంలోకి వచ్చిన పవన్ కళ్యాణ్ ఓడిపోయినా గాని ఏ మాత్రం తన టార్గెట్ మిస్  అవ్వకుండా మొదటినుండి సీఎం జగన్ ని ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు కంటే భారీ స్థాయిలో పవన్ కళ్యాణ్ అనేకమార్లు విమర్శలు చేయడం జరిగింది. అయినాగానీ రాష్ట్రంలో ప్రజలనుండి సరైన స్పందన రాకపోవడంతో, తనకి సరైన సపోర్ట్ లేకపోవడంతో పవన్ కళ్యాణ్ బీజేపీతో చేతులు కలిపి జగన్ ని ఆడించాలని భావించినట్లు జనసేన బీజేపీ పొత్తు పై వార్తలు వచ్చాయి.

 

పరిస్థితి ఇలా ఉండగా ఏడాది పరిపాలనలో జగన్ ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని అమలు చేస్తూ ఇచ్చిన వాగ్దానాన్ని హామీలను నెరవేరుస్తూ రావటం తో దేశవ్యాప్తంగా జగన్ పరిపాలనపై అనేక ప్రశంశలు లభిస్తున్నాయి. కరోనా లాంటి సంక్షోభ సమయంలో కూడా జగన్ చేసిన పనులు దేశవ్యాప్తంగా హైలైట్ అయ్యాయి. మరి ఇలాంటి తరుణంలో ఇటీవల 108,104 అంబులెన్సులను జగన్ ఓపెన్ చేయడం తో చాలా మంది జాతీయ స్థాయిలో ఉన్న మీడియా విలేకరులు సినిమా యాక్టర్లు అదే విధంగా పెద్ద పెద్ద తల పండిపోయిన రాజకీయ నేతలు సరైన సీఎం వైయస్ జగన్ అని విజన్ ఉన్న నాయకుడు అని కరోనా లాంటి సంక్షోభ సమయంలో అద్భుతమైన నిర్ణయం తీసుకున్నారని పొగడటం జరిగింది.

 

ఇలాంటి తరుణంలో ఎప్పుడూ విమర్శించే పవన్ కళ్యాణ్ కూడా జగన్ ని పొగడ్తలతో ఆకాశానికి ఎత్తేశారు. కరోనా వైరస్ ని అద్భుతంగా ఎదుర్కొనడంలో ఏపీ ప్రభుత్వం పనితీరు బాగుంది అని ముఖ్యంగా ఆంబులెన్స్ సరైన టైంలో ఓపెన్ చేశారని వైయస్ జగన్ పనితీరు అభినందనీయమని పొగిడారు. ఎన్నడూ లేని విధంగా వైఎస్ జగన్ ని సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ పొగడటంతో ఈ వార్త ఏపీ రాజకీయాల్లో మీడియా సర్కిల్ లో వైరల్ గా మారింది.

 

అయితే ఈ పవన్ కళ్యాణ్ జగన్ ని పొగడటం వెనుక ల స్ట్రాటజీ ఉందని పరిశోధకులు అంటున్నారు. అదేమిటంటే ఇటీవల వైయస్ జగన్ కాపు కార్పొరేషన్ పేరిట కాపులకు గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా నిధులు కేటాయించి అనేక సమస్యలు తీర్చే విధంగా చర్యలు చేపట్టింది. దీంతో చాలావరకు కాపులు ఇప్పుడు వైఎస్ జగన్ నాయకత్వాన్ని బలంగా నమ్ముతున్నారు. ఇలాంటి తరుణంలో జగన్ ని పొగడక పోతే సొంత సామాజిక వర్గం లో వ్యతిరేక ముద్ర పడే అవకాశం ఉందని...అందువల్లే విజ్ఞతతో పవన్ కళ్యాణ్ వై ఎస్ జగన్ అభినందించటం జరిగిందని మేధావులు అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: