గ్రూపు రాజకీయాలకు పెట్టింది పేరైన కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఇప్పటికీ అనేక ఇబ్బందులను ఎదుర్కొంటోంది..ఇప్పటికే గ్రూపు తగాదాలు కారణంగా, రెండు సార్లు టిఆర్ఎస్ పార్టీకి అధికారాన్ని కాంగ్రెస్ కట్టబెట్టింది.. నాయకుల మధ్య సమన్వయం లేకపోవడం, ఒకరి ఎదుగుదలను మరొకరు ఓర్చుకోలేక, గ్రూపు రాజకీయాలకు పాల్పడుతూ, సొంత పార్టీ నాయకులు వ్యవహరిస్తున్న తీరుతో, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మరింత దిగజారేలా కనిపిస్తోంది. ఈ తరుణంలో పార్టీకి మళ్ళీ తిరిగి పునర్వైభవం తీసుకు వచ్చేందుకు, పిసిసి అధ్యక్ష పదవిలో కొత్త వారిని నియమించాలని ఎప్పటి నుంచో చూస్తోంది. కానీ ఈ పదవిని భర్తీ చేసే విషయంలో నాయకుల మధ్య సమన్వయం లేకపోవడం, 7

IHG

 

ఒకరికి ఇస్తే మరొకరు ఆగ్రహం చెంది విధంగా, పరిస్థితులు కనిపించడం వంటి పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం ఎప్పటికప్పుడు ఈ నిర్ణయం వాయిదా వేసుకుంటూ వస్తోంది. పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లో  ఇప్పటికే పిసిసి అధ్యక్షుడిగా మాజీ మంత్రి శైలజానాథ్ ను అధిష్ఠానం నియమించింది. అలాగే కర్ణాటక లో డీకే శివకుమార్ను పిసిసి అధ్యక్షుడిగా నియమించారు. కానీ తెలంగాణ విషయానికి వచ్చేసరికి అధిష్టానం కూడా భయపడుతోంది ఇప్పటికే ఉత్తం కుమార్ రెడ్డి  ఆధ్వర్యంలో పార్టీ రెండు సార్లు టీఆర్ఎస్ కు కట్టబెట్టింది. ఈ రెండు ఎన్నికలకు పిసిసి అధ్యక్షుడిగా ఉత్తమ్ బాధ్యతలు నిర్వహించారు. ఈ ఎన్నికల్లో పార్టీ ఓటమి చెందడంతో ఎప్పటి నుంచో ఆయన తనను ఆ బాధ్యతల నుంచి తప్పించాలని అధిష్టానానికి ఉత్తమ్ మొర పెట్టుకుంటున్నారు.

 

ఈ నేపథ్యంలోనే ఆ పదవిని భర్తీ చేయాలని అధిష్టానం భావిస్తోంది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రేవంత్ రెడ్డి, శ్రీధర్, బాబు jeevan REDDY' target='_blank' title='జీవన్ రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>జీవన్ రెడ్డి, జగ్గారెడ్డి వంటి వారి పేర్లు తెర మీదకు వస్తున్నాయి .కాంగ్రెస్ అధిష్ఠానం మాత్రం రేవంత్ రెడ్డి వైపు మొగ్గు చూపుతుండగా, మిగతా సీనియర్లంతా మూకుమ్మడిగా రేవంత్ నాయకత్వాన్ని అంగీకరించేది లేదు అంటూ అధిష్టానానికి హెచ్చరికలు చేస్తున్నారు. ఎవరిని అధ్యక్షుడుగా నియమించినా ఫర్వా లేదు అంటూ ఖండిగా చెప్పేసింది ఉండటంతో ఈ వ్యవహారాన్ని మరికొంత కాలం నాన్చాలి అనే ఉద్దేశంతో కాంగ్రెస్ హై కమాండ్ ఉన్నట్టుగా  కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: