ప్రజెంట్ చైనాపై ఎప్పుడు ప్రతీకారం తీర్చుకుందామ అన్న రీతిలో ఉంది ఇండియా. డ్రాగన్ కంట్రీ సైనికులు సరిహద్దులు దాటి భారత భూభాగంలోకి అక్రమంగా వస్తున్న నేపథ్యంలో ఇటీవల జూన్ 15వ తారీఖున ఇండియన్ ఆర్మీ వారిని అడ్డుకోగా రెండు దేశ సైనికుల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. జరిగిన ఈ ఘటనలో భారత్ ఆర్మీ కి చెందిన 20 మంది జవాన్లు చనిపోవడం జరిగింది. ఈ ఘటన జరగడంతో ఒక్కసారిగా దేశవ్యాప్తంగా చైనా పై వ్యతిరేకత తీవ్ర స్థాయిలో వచ్చింది. సోషల్ మీడియాలో చైనా వస్తువులను నిషేధించారని పెద్ద ఎత్తున నెటిజన్లు కామెంట్లు చేయడం జరిగింది.

 

ఇటువంటి తరుణంలో కేంద్ర ప్రభుత్వం చైనా దేశానికి చెందిన 59 యాప్స్ నిషేధించడం మనకందరికీ తెలిసిందే. నిషేధించిన  యాప్స్ లో టిక్ టాక్ యాప్ కూడా ఉండటంతో చాలా మంది భారతీయులు నిరుత్సాహం చెందారు. ఈ యాప్ కి బాగా అలవాటు పడటంతో టిక్ టాక్ విషయంలో కేంద్రం పునరాలోచన చేయాలని కోరడం జరిగింది. కానీ దేశ భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకోవటం జరిగిందని వెనక్కి తీసుకొని పరిస్థితి ఏర్పడింది. ఇదిలా భారత చిరకాల శత్రుదేశం పాకిస్థాన్ ఇటీవల పబ్జి గేమ్ ని నిషేధించింది.

 

ఆ దేశంలో ఎక్కువగా యువకులు మరియు చిన్నారులు చాలా సమయాని పబ్జి గేమ్ కి కేటాయిస్తున్న తరుణంలో దేశ ప్రధాని ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంతే కాకుండా పాకిస్తాన్ యువతలో ఈ గేమ్ ఆడటం వల్ల నేర ప్రవర్తన మరింతగా పెరుగుతుందని ముందు జాగ్రత్తగా ఇమ్రాన్ ఖాన్ పబ్జి గేమ్ ని పాకిస్తాన్ లో నిషేధించారు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించడం జరిగింది. చైనా మరియు సౌత్ కొరియా కలిసి రూపొందించిన ఈ గేమ్ యాప్ ని పాకిస్తాన్ నిషేధించడంతో చాలావరకు రెండు దేశాలకు ఆర్థికంగా కొంత నష్టం వాటిల్లే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: