ప్రధాని నరేంద్ర మోడీ నిన్న భారత్-చైనా సరిహద్దు ప్రాంతమైన లడఖ్ లో చేసిన ఆకస్మిక పర్యటన దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీసిన విషయం తెలిసిందే. నేపథ్యంలో మోడీ పర్యటన ముగిసిన వెంటనే చైనా వారు అందుకు సంబంధించిన తమ రెస్పాన్స్ ను తెలిపారు. భారత్-చైనా సరిహద్దు లో ఉద్రిక్తతలను నివారిస్తే బాగుంటుందని తమ అభిప్రాయపడుతున్నట్లు చైనా తెలిపింది. ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనను ఉద్దేశిస్తూ చైనా విదేశాంగ శాఖ ఇకనైనా ఉద్దేశపూర్వకంగా తప్పుడు అంచనా వేసే అలవాటును భారత్ మానుకోవాలని సూచించింది.

 

అయితే మోదీ పర్యటన పూర్తిగా చైనా ఉద్దేశించింది కాదు అని చివరికి వారికి అర్థమైంది. లడఖ్ లో మోదీ చేపట్టిన పర్యటనను చైనా వర్గాలు నిశితంగా పరిశీలిస్తున్న ప్రధాని మోదీ పర్యటన అటూ భారత్ కు ఇటు చైనాకు కాకుండా ప్రపంచానికి ప్రపంచానికి కూడా ఎటువంటి సందేశాన్ని ఇస్తోంది అనే అంశంపై ఇపుడు విశ్లేషణలు జరుగుతున్నాయి. ఇక మోదీ మాట్లాడిన మాటల్లో చైనా ను నేరుగా విమర్శించకపోగా వెంటనే చైనా వారు ఇదే అదనుగా తమను తప్పుడు అంచనా వేసే అలవాటును మానుకోవాలని సూచించడం.. ఇక అది కూడా కొద్ది గంటల్లోనే రావడాం గమనార్హం.

 

ఇక ఇది ఇలా ఉండగా మోదీ బీహార్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని అక్కడికి వెళ్లారని రాహుల్ గాంధీ తో సహా మిగిలిన విపక్షాలు అతనిని చూస్తుంటే దీనివెనుక చాలా పెద్ద ప్లాన్ ఉన్నట్లు తెలుస్తోందని ప్రజలంతా అభిప్రాయపడుతున్నారు.

 

ఇక ఇప్పటికే అమెరికా మరియు జపాన్.... భారత్ కు చైనా పై డిజిటల్ పోరాటంలో గాని మరియు మామూలు యుద్ధంలో కానీ తమ పూర్తి సహకారం అందిస్తామని స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు మోడీ సరిహద్దు సైనికులు వద్దకు వచ్చి కొన్ని విషయాలను చర్చించడం మూలానా రాబోయే రోజుల్లో చైనా వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది అని తలచుకుంటేనే అందరికీ దిమ్మ తిరిగి పోతుంది. ఏదైనా 20 మంది గల్వాన్ లోయలో చనిపోయిన విషయాన్ని మోదీ క్రమంగా చాలా పర్సనల్ గా తీసుకున్నట్లు అనిపిస్తుంది. ఇక్కడినుండే చైనా వారి పతనం మొదలవ్వాలని అతను గట్టిగా కూర్చున్నట్లే ఉన్నాడు.

 

విషయం ఏమిటంటేకేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ విదేశాంగ శాఖ మంత్రి సుబ్రహ్యణ్యం జైశంకర్లతో ప్రధానమంత్రి సమావేశమవుతారని సమాచారం. భేటీలో ఆయా శాఖలకు చెందిన ఉన్నతాధికారులు హాజరవుతారని తెలుస్తోంది. త్రివిధ దళాధిపతులతో.. ఆర్మీ చీఫ్ మేజర్ జనరల్ మనోజ్ ముకుంద్ నరవణే భారత నౌకాదళాధిపతి అడ్మిరల్ కరమ్ బీర్ సింగ్ వాయుసేన చీఫ్ రాకేష్ కుమార్ సింగ్ బదౌరియా భేటీకి హాజరయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. మరి భేటీలో చైనాను వణికించేలా ఏం డిసైడ్ చేస్తారో..?

 

మరింత సమాచారం తెలుసుకోండి: