వైఎస్ జగన్ ది సంక్షేమ రాజ్యం అని ఇప్పటికే తేలిపోయింది. ఆయన తన తొలి ప్రాధాన్యత సంక్షేమానికే ఇస్తున్నారు. అందులోనూ రైతులు, బలహీనవర్గాలు ఆయన టార్గెట్ గా ఉంటున్నాయి. అలాంటి జగన్ రైతులకు మరో గుడ్ న్యూస్ చెప్పారు. అయితే ఇది అందరు రైతులకు కాదు.. చెరకు రైతులకు ఇది చెరుకు గడ లాంటి తీపి వార్త.

 

 

చెరకు రైతులకు సంబంధించి ఒక్క రూపాయి కూడా బకాయి లేకుండా తీర్చేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. రూ.54.6 కోట్ల బకాయిలను ఈ నెల 8న రైతు దినోత్సవం సందర్భంగా చెల్లించడానికి చర్యలు తీసుకోవాలని అధికారులను జగన్ ఆదేశించారు. ఈ ఆదేశంతో దాదాపు 15 వేల మంది చెరకు రైతులకు ప్రయోజనం చేకూరుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

 

 

సహకార రంగంలోని చక్కెర ఫ్యాక్టరీల పునరుద్ధరణపై నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షలో జగన్ ఈ ఆదేశాలు ఇచ్చారు. సహకార చక్కెర ఫ్యాక్టరీలపై మరింతగా అధ్యయనానికి మంత్రుల బృందం ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించారు. ఈ మంత్రుల బృందం లోతుగా అధ్యయనం చేసి ఆగస్టు 15వ తేదీలోగా సమగ్ర నివేదికను సమర్పించాలని జగన్ ఆదేశించారు.

 

 

నిజంగా ఇది చెరకు రైతులకు చాలా గుడ్ న్యూస్ అని చెప్పాలి. ఏటా పంట చెరకు ఫ్యాక్టరీలకు పంపడమే కానీ.. వారు సకాలంలో సొమ్ము తీసుకుని ఎరుగరు. ఎప్పటికప్పుడు బకాయిలు పేరుకుపోతుండేవి.. ఈసారి జగన్ చొరవతో బకాయిలు అన్నదే లేకుండా చేయడం వారికి పండుగ లాంటి వార్తే.

 

మరింత సమాచారం తెలుసుకోండి: