తెలంగాణలో కరోనా విజృంభిస్తోంది. రోజూ కనీసం వెయ్యి కొత్త కేసులు వస్తున్నాయి. అంతే కాదు.. వీఐపీలు, వీవీఐపీలు కూడా ఈ కరోనా నుంచి తప్పించుకోలేకపోతున్నారు. ఈ మధ్యనే తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ కి కూడా కరోనా వచ్చిన సంగతి తెలిసిందే. ఒకరిద్దరు ఎమ్మెల్యేలకూ కరోనా వచ్చింది. అయితే ఇప్పుడు ఈ కరోనా ఏకంగా కేసీఆర్ ఇంటి వరకూ వచ్చేయడం మరో షాకింగ్ న్యూస్.

 

 

కేసీఆర్ నివాసమైన ప్రగతి భవన్‌లో కరోనా కలకలం రేపుతోందట. సీఎం కేసీఆర్ అధికారిక నివాసం ప్రగతి భవన్‌లో ఏకంగా ముప్పై మందికి వరకూ కరోనా వైరస్ సోకిందని వార్తలు వస్తున్నాయి. అయితే ఈ ముప్పై మందిలో కేసీఆర్ సెక్యూరిటీ ఆఫీసర్ కూడా ఉన్నట్టు సమాచారం అందుతోంది. మరి అంత పకడ్బందీగా ఉంటే ప్రగతి భవన్‌లో కి కరోనా ఎలా అడుగు పెట్టిందోనని అంతా షాకవుతున్నారు.

 

 

అయితే.. సీఎం ఆఫీసుకు వచ్చే క్యాటరింగ్ సిబ్బంది ద్వారా వైరస్ ప్రగతి భవన్ లో అడుగు పెట్టినట్టు అనుమానిస్తున్నారు. మొదట క్యాటరింగ్ సిబ్బంది ఏడుగురికి వైరస్ వచ్చిందట. అక్కడి నుంచి క్రమంగా ఒక్కొక్కరికీ వ్యాపించుకుంటూ మొత్తం 30 మంది వరకూ కరోనా బారిన పడ్డట్టు తెలుస్తోంది.

 

 

ముఖ్యమంత్రి సెక్యూరిటీ లో ఒక ముఖ్యమైన అధికారితో పాటు ప్రగతిభవన్‌లో పనిచేసే డ్రైవర్లు, ఇతర సిబ్బందికి కూడా పాజిటివ్‌ వచ్చినట్టు తెలుస్తోంది. ప్రగతి భవన్‌లో కరోనా బారిన పడ్డ వైరస్‌ బాధితుల్లో ఇప్పటికే కొందరు డిశ్చార్జ్‌ కూడా అయ్యారట. మరికొందరు చికిత్స పొందుతున్నారు. ఇంకొందరు క్వారంటైన్‌లో ఉన్నారు. ఏదేమైనా అన్ని జాగ్రత్తలు తీసుకునే సీఎం నివాసంలోనే కరోనా కలకలం రేపడం విచిత్రమే.

 

మరింత సమాచారం తెలుసుకోండి: